తన లైఫ్ సీక్రెట్ ని ప్రభాస్ కి మాత్రమే చెప్పిన హీరోయిన్.. నిజంగా షాకింగ్, మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇలా..
సాధారణంగా తన లైఫ్ సీక్రెట్స్ ని హీరోయిన్లు అత్యంత సన్నిహితులతో తప్ప మిగిలిన వారితో షేర్ చేసుకోరు. ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ కి తన లైఫ్ సీక్రెట్ ని రివీల్ చేసిందట.
హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. చాలా మంది హీరోయిన్లు కెరీర్ లో ఆకాశమంత ఎత్తు ఎదిగి చివరికి విషాదకరంగా జీవితాన్ని ముగించిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు అనుకోకుండా హీరోయిన్ గా మారి సంచలనం సృష్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సాధారణంగా తన లైఫ్ సీక్రెట్స్ ని హీరోయిన్లు అత్యంత సన్నిహితులతో తప్ప మిగిలిన వారితో షేర్ చేసుకోరు. ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ కి తన లైఫ్ సీక్రెట్ ని రివీల్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన కంగనా రనౌత్.
కంగనా రనౌత్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఏక్ నిరంజన్. అంతకు ముందు కంగనా కొన్ని హిందీ చిత్రాల్లో నటించింది. షూటింగ్ సమయంలో తన లైఫ్ గురించి కంగనా ప్రభాస్ తో అనేక విషయాలు పంచుకుందట. తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని సినిమాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
ఒకసారి తన స్నేహితులతో కలసి కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఒక జ్యోతిష్యుడు ఆమె చేయి చూసి నువ్వు హీరోయిన్ అవుతావు అని చెప్పాడట. ఆ టైంకి కంగనా కి సినిమాల గురించి, చిత్ర పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. సినిమాలతో సంబంధం లేని జీవితం ఆమెది. ఈయనేంటి ఇలా చెబుతున్నాడు అని అనుకుందట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంగనా హీరోయిన్ అయింది. అంతే కాదు బాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా వివాదాలు, సంచలనాలు సృష్టించింది.
ఈ విషయాన్ని ప్రభాస్ రాధే శ్యామ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో రివీల్ చేశారు. తాను కూడా జ్యోతిష్యాన్ని తమ్మేవాడిని కాదని కానీ బాహుబలి తర్వాత నుంచి నమ్ముతున్నట్లు ప్రభాస్ తెలిపాడు. బాహుబలి లాంటి సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది అంటే అది తన లైఫ్ లో జరిగిన మిరాకిల్ అని ప్రభాస్ పేర్కొన్నాడు.