ప్రభాస్ తో సినిమా చేయనని పారిపోయిన నిర్మాత..యంగ్ రెబల్ స్టార్ జీవితం మార్చేసిన సంఘటన
పెదనాన్న కృష్ణంరాజు అండతో ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. తన లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చూశాం. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో విజువల్స్ తో నాగ్ అశ్విన్ మైమరపించేలా చేశాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలో ఈ చిత్రంలో హైలైట్ అయ్యాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. సౌత్ నుంచి 1000 కోట్ల వసూళ్లు రాబట్టగిలిగే సత్తా ఉన్న హీరోగా ప్రభాస్ ఎదిగాడు. ప్రభాస్ స్టామినాకి బాలీవుడ్ వాళ్ళు సైతం సలాం కొడుతున్నారు. ప్రభాస్ ఈ స్థాయికి చేరడం వెనుక చాలా స్ట్రగుల్ ఉంది.
పెదనాన్న కృష్ణంరాజు అండతో ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. తన లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి చిత్రం ఫ్లాప్. రెండవ చిత్రం రాఘవేంద్ర యావరేజ్ గా నిలిచింది. జస్ట్ ఒకే.
రెండవ చిత్రం చేస్తున్నప్పుడే మూడవ చిత్రం, నాల్గవ చిత్రం కూడా ఖరారయ్యాయి. నా ఫస్ట్ రెండు చిత్రాల రిజల్ట్ చూశాక మూడవ చిత్రాన్ని నిర్మించాల్సిన నిర్మాత పారిపోయాడు. నాతో సినిమా చేయడం ఆయనకి ఇష్టం లేదు. నా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయని ఆయన భయం. ఆ టైం లో చాలా స్ట్రగుల్ అయ్యాను.
దీనితో మూడవ చిత్రం ఆగిపోయింది. 4వ మూవీ గా చేయాలనుకున్న చిత్రం మూడవ చిత్రంగా మారింది. అదే వర్షం. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నా కెరీర్ మారిపోయింది అని ప్రభాస్ తెలిపాడు.
వర్షం నుంచి నా అసలైన జర్నీ మోడలింది. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో కెరీర్ ముందుకు సాగుతోంది అని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ తో సినిమా చేయనని నిర్మాత పారిపోయిన స్థితి నుంచి.. ఈరోజు బాలీవుడ్ వాళ్ళు సైతం ప్రభాస్ తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. నిజంగా వర్షం చిత్రం ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది అని చెప్పొచ్చు.