- Home
- Entertainment
- Radhe Shyam review:ప్రభాస్ 'రాధే శ్యామ్' ట్విట్టర్ టాక్.. విజువల్స్ స్టన్నింగ్, చిన్నపాటి లోపం అదే..
Radhe Shyam review:ప్రభాస్ 'రాధే శ్యామ్' ట్విట్టర్ టాక్.. విజువల్స్ స్టన్నింగ్, చిన్నపాటి లోపం అదే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. సినిమా క్లాస్ గా ఉందంటూ ట్విట్టర్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే . చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది. రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు. అతడి ప్రేయసిగా పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరి ప్రేమకు విధి అడ్డుగా మారితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి ? విజయం ప్రేమదా ? విధిదా ? అనేదే ఈ చిత్ర కథ. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించారు.
ఇప్పటికే హైదరాబాద్, యూఎస్ లలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. దీనితో ట్విటర్ లో ప్రేక్షకులు సినిమా విశేషాలని పంచుకుంటున్నారు. ట్విట్టర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది.. మూవీలో హైలైట్స్ ఏంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ప్రభాస్ విక్రమాదిత్యగా సూపర్ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. ముందు నుంచి ట్రైలర్, టీజర్స్ లో చూపించినట్లుగానే విక్రమాదిత్య పామ్ ఆర్టిస్ట్.
ఇక పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా ఎంట్రీ ఇచ్చింది. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎప్పటిలాగే ఆకట్టుకుంటోంది. ప్రతి సన్నివేశం క్లాస్ గా, గ్రాండ్ విజువల్స్ తో ఉందని ట్విట్టర్ జనాలు చెబుతున్నారు. ప్రతి సన్నివేశాన్ని కళాత్మకంగా తెరకెక్కించారు. విజువల్స్ అద్భుతమైన ఫీలింగ్ ఇస్తాయి అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక కథలోకి జగపతి బాబు ఎంటర్ అయ్యాక ట్విస్టులు మొదలవుతాయి.
సినిమా ఫస్ట్ హాఫ్ విజువల్ పరంగా గ్రేట్ అనిపించే విధంగా ఉంది. కానీ కథలో మ్యాజిక్ ఎక్కడో మిస్ అయ్యిందనే ఫీలింగ్ ఉన్నట్లు ట్విట్టర్ లో ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ మెస్మరైజింగ్ గా ఉంది. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీకి కావాల్సిన విధంగా ప్రభాస్ , పూజా హెగ్డే బ్రిలియంట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.
ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో కథ బలంగా లేనప్పటికీ గ్రాండ్ విజువల్స్.. ప్రభాస్, పూజా కెమిస్ట్రీ .. మ్యూజిక్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంటాయి. షాకింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. అప్పటి నుంచి మూవీ అసలు కథలోకి ఎంటర్ అవుతుంది. దీనితో సెకండ్ హాఫ్ పై ప్రేక్షకులు ఆసక్తితో ఉంటారు.
సెకండ్ హాఫ్ లో ప్రభాస్ తో జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ల మధ్య వచ్చే పామిస్ట్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ తర్వాత అసలు కథ రివీల్ అవుతూ వస్తుంది. కొంతమంది ట్విట్టర్ జనాలు ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా.. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా ఉందని అంటున్నారు. క్లైమాక్స్ షిప్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో లేకున్నా పర్వాలేదని అంటున్నారు.
దర్శకుడు రాధాకృష్ణ సినిమా సెట్స్, విజువల్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లు అర్థం అవుతుంది. ప్రతి సీన్ విజువల్స్ కి అప్లాజ్ వస్తోంది. అయితే కంటెంట్ లో సోల్ మిస్సయిందని అంటున్నారు. ప్రేమ కథకి కావాల్సిన ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో లేవని అంటున్నారు. కానీ సినిమాని ఎండింగ్ చేసిన విధానం అద్భుతం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
ఓవరాల్ గా రాధే శ్యామ్ చిత్రం క్లాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే మూవీ అని ట్విట్టర్ లో టాక్. మిగిలిన ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండవు. మరి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది.