Radhe Shyam: రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మైండ్ బ్లోయింగ్ టాక్
రాధే శ్యామ్ మూవీ ప్రొమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ప్రభాస్-పూజా హెగ్డే ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చిత్ర విడుదలకు రోజుల సమయం మాత్రమే ఉండగా విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

మరోవైపు రాధే శ్యామ్ చిత్ర ఫస్ట్ రివ్యూ (Radhe Shyam review)వచ్చేసింది. ఓవర్ సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సందు రాధే శ్యామ్ చిత్రం ఎలా ఉందో షార్ట్ రివ్యూ ఇచ్చారు. ఆయన వరుస ట్వీట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో జోరు నింపారు. మరి ఉమర్ సందు రాధే శ్యామ్ చిత్రం గురించి ఏం చెప్పారో చూద్దాం..
రాధే శ్యామ్ విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతమని ఉమర్ సందు తెలిపారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ విజువల్స్ అబ్బురపరుస్తాయన్న అభిప్రాయం వెల్లడించారు. ఇక మెయిన్ లీడ్ ప్రభాస్, పూజా హెగ్డే (Pooja Hegde) మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుంది అన్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే మిస్టరీ, ట్విస్ట్ అలరిస్తుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందన్నారు.
ప్రభాస్ (Prabhas) నటన, అందం గురించి ఉమర్ సందు ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ప్రభాస్ స్టైల్ ఇండియాలో మరో హీరో బీట్ చేయలేదన్న ఆయన.. సినిమాలో చాలా సెక్సీగా ఉన్నాడని పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తంగా రాధే శ్యామ్ మూవీ తనకు ఎంతగానో నచ్చేసిందని ఉమర్ సందు సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు.
అయితే ఎప్పటిలాగే ఉమర్ సందు ట్వీట్స్ కి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఉమర్ సందు ఇలాంటి పాజిటివ్ రివ్యూలు ఇస్తాడు. ఆయన టాప్ రేటింగ్ ఇచ్చిన చిత్రాలు కొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. కాబట్టి నీ రివ్యూ నమ్మం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రాధే శ్యామ్ ప్రోమోలు చూస్తే సినిమా భారీ విజయం సాధిస్తుందన్న భావన కలుగుతుంది.ప్రభాస్ గత చిత్రం సాహో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు. రాధే శ్యామ్ తో ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇవ్వాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారు. ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్నారు.
Radhe Shyam
దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కించారు. సినిమా ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుంది.