- Home
- Entertainment
- Radhe Shyam Promotions : ప్రమోషన్స్ కోసం ప్రభాస్, పూజా హెగ్దే న్యూ లుక్.. యూకే, యూఎస్ఏ లో రాధే శ్యామ్ హవా..
Radhe Shyam Promotions : ప్రమోషన్స్ కోసం ప్రభాస్, పూజా హెగ్దే న్యూ లుక్.. యూకే, యూఎస్ఏ లో రాధే శ్యామ్ హవా..
రాధే శ్యామ్ (Radhe Shyam) వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. తాజాగా చిత్రయూనిట్ తో పాటు, ప్రభాస్, పూజా హెగ్దే కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. నిన్న ముంబయిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయగా.. తాజాగా న్యూ లుక్ లో ప్రమోషన్స్ ను కొసాగిస్తున్నారు.

పాన్ ఇండి స్టార్ ప్రభాస్ (Prabhas), గ్లామర్ బ్యూటీ పూగా హెగ్దే (Pooja Hegde) కలిసి జంటగా నటించిన చిత్రం ‘రాధ్యే శ్యామ్’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్, ప్రేక్షకులకు క్షణాల్లో తెలిసిపోతోంది. దీని బట్టి ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు యూనిట్. నిన్న ముంబయిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, పూజాతో పాటు దర్శకుడు రాధాక్రిష్ణ కూడా హాజరయ్యారు. మీడియాతో సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రమోషన్స్ సంగతి అటుంచితే.. ప్రభాస్.. పూజా హెగ్ధే కలిసి ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం ఆసక్తిగా మారింది. ఇందుకు వీరు ధరించే దుస్తులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇంకా ముంబైలోనే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది రాధే శ్యామ్ టీం. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రభాస్, పూజా హెగ్ధే అట్రాక్టివ్ లుక్ ను ప్రదర్శించారు.
నిన్న ఫుల్ బ్లాక్ అపియరెన్స్ ఇచ్చిన ప్రభాస్.. తాజా ఫొటోల ప్రకారం బ్లూ జాకెట్.. వైట్ టీషర్ట్ లో దర్శనమిచ్చారు. గగూల్స్ ధరించడంతో ప్రభాస్ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఇక నిన్న నీల్ పైకి వైట్ మినీ బాడీ కాన్ డ్రెస్ ధరించిన పూజా హెగ్దే తాజాగా రెడ్ బాడీ కాన్ ఫుల్ లెన్త్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ అవుట్ ఫిట్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ భారీ బడ్జెట్ మూవీని రూ.300 కోట్లతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ టెక్నాలజీతో సినిమాను నిర్మించారు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటరికల్ రిలీజ్ కానున్న ఈ మూవీ ఇప్పటికే ప్రీ సెల్స్ లోనూ దుమ్ము దులుపుతోంది. యూఎస్, యూకేలో మంచి బిజినెస్ చేస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం యూకేలో రాధే శ్యామ్ బుక్కింగ్స్ జోరుగా ఉన్నాయి. యూకే అంతటా 47 లోకేషన్స్ లో బుక్సింగ్స్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 6వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. మొత్తంగా గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 71 లక్షల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ బిజినెస్ స్టేటస్ ఎక్స్ లెంట్ గా ఉన్నట్టు సినీ విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం.
అలాగే యూఎస్ లోనూ ప్రీ సెల్స్ కలెక్షన్స్ లక్షా 75 వేల డాలర్స్ దాటినట్టు సమాచారం. అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా ఓపెన్ ఉండటంతో మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రస్తత బిజినెస్ చూస్తుంటే రాధే శ్యామ్ డే వన్ ఓవర్సీస్ కలెక్షన్ రికార్డు స్థాయిలో ఉంటోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేమకి, విధికి మధ్య సాగే ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్ పతాకంపై నిర్మాతలు వంశీ, భూషణ్ కుమార్, ప్రమోద్, ప్రసీదలు నిర్మిస్తున్నారు.