- Home
- Entertainment
- Srinidhi Shetty : ‘కేజీఎఫ్’ హీరోయిన్ కు ప్రభాస్ ఫోన్ కాల్.. ఫుల్ ఖుషీ అవుతున్న శ్రీనిధి శెట్టి..
Srinidhi Shetty : ‘కేజీఎఫ్’ హీరోయిన్ కు ప్రభాస్ ఫోన్ కాల్.. ఫుల్ ఖుషీ అవుతున్న శ్రీనిధి శెట్టి..
తొలి సినిమాతోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). కేజీఎఫ్ తో ఒక్కసారిగా తన క్రేజ్ పెరిగిపోయింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి స్పెషల్ విషెస్ అందండంతో ఫుల్ ఖుషీ అవుతోంది.

కన్నడ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియ సినిమాగా సత్తా చాటిన చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్ (Yash) ప్రధాన పాత్ర పోషించారు. హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించింది.
మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు ఛాప్టర్ 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ తో శ్రీనిధికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. పైగా మేల్ డీల్ రోల్ లో దక్కడంతో ఊహించని పాపులారిటీని దక్కించుకుంది.
హుంబాలే ఫిల్మ్స్ నిర్మించి కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న అన్ని భాషల్లో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రాఖీ బాయ్ ఇంకా బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2పై విమర్శకుల నుంచి అన్ని చిత్ర పరిశ్రమల స్టార్ హీరోల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ టీమ్ కు.. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హీరో యష్ కు అభినందనలు తెలిపారు.
అయితే కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Kgf Chapter 2) చూసిన తర్వాత ప్రభాస్ (Prabhas) హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటన ప్రత్యేకంగా అభినందించారంట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ లోని సూరికి ఫోన్ చేసి చెప్పారట. హీరోయిన్ గా తన పాత్రకు న్యాయం చేసిందని, తన నటన అద్భుతంగా ఉందని తెలిపారని శ్రీనిధి స్వయంగా తెలిపింది.
ఇందుకు ఫుల్ ఖుషీ అవుతూ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రభాస్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆనందంలో మునిగితేలుస్తోంది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తోంది. మున్ముందు మరిన్ని సినిమాలతో అలరించనుంది.