Top Stars Favorite Foods: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, పవన్, బన్నీ, చరణ్... మీ అభిమాన హీరోల ఇష్టమైన ఫుడ్స్ ఇవే!
స్టార్స్ అంటే జనాల్లో ఉండే క్రేజ్ వేరు. వారికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలి అనుకుంటారు. మరి టాలీవుడ్ టాప్ హీరోల ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసా...
Tollywood Top Stars Favorite foods
హీరోల మీద ఉండే అభిమానానికి హద్దులు లేవు. ప్రతి విషయంలో వాళ్ళను ఫాలో అయిపోతారు. తమ అభిమాన హీరోల ఇష్టాలు, వ్యాపకాలు, జీవన విధానం తెలుసుకోవాలని కోరుకుంటారు. అభిమానులను ఆకర్షించే అంశాలలో ఇష్టమైన ఫుడ్స్ కూడా ఒకటి. మన టాలీవడ్ టాప్ స్టార్స్ ఇష్టపడే వంటకాలు ఏమిటో మీరే చూడండి...
Prabhas
ప్రభాస్ భోజన ప్రియుడు. ఎక్కువగా నాన్ వెజ్ తింటారట. తనతో నటించే హీరోయిన్ కి పలు వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కి ఉన్న సాంప్రదాయం. ఇక ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ మాత్రం రొయ్యల పులావ్.
ఎన్టీఆర్ కూడా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతారట. తనకు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పారు.
అందాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు మహేష్ బాబు. కానీ చీటింగ్ డే నాడు తనకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తారు. మహేష్ బాబుకు హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం అట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లెమన్ రైస్, అరటికాయ ఫ్రై అంటే ఇష్టం అట. చికెన్ బిర్యానీ కూడా ఇష్టంగా తింటారట.
హీరో అల్లు అర్జున్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్. కెరీర్ బిగినింగ్ లోనే సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. అల్లు అర్జున్ కి ఇష్టమైన వంటకం బిర్యానీ.
రామ్ చరణ్ బాడీ చూస్తే అమ్మాయిలు మాయలో పడిపోతారు. దాని కోసం ఆయన ప్రత్యేకమైన డైట్ తీసుకుని వ్యాయామం చేస్తారు. ఇక రామ్ చరణ్ కి ఇష్టమైన ఫుడ్ బాదం మిల్క్.
ఇక మెగాస్టార్ చిరంజీవి సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారట. చేపలు, రొయ్యలు, పీతలు అంటే ఆయనకు ఇష్టమని సమాచారం.
నట సింహం బాలయ్య కూడా ఆహార ప్రియుడే. ఆయనకు చికెన్ బిర్యానీ, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. నాన్ వెజ్ అమితంగా తింటారట.
హీరో వెంకటేష్ కి నాటు కోడి, పులావ్ అంటే అమిత ఇష్టం అట. తరచుగా నాటు కోడి కూరతో భోజనం చేస్తారట. రానాకి కూడా నాటుకోడి కూర అంటే ఇష్టం అట.
60 ఏళ్ల వయసు దాటినా యంగ్ గా కనిపిస్తున్నాడు కింగ్ నాగార్జున. అందుకే క్రమశిక్షణతో కూడిన జీవన శైలి దీనికి కారణం. నాగార్జన ఫేవరేట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ.