ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, బన్నీ, చరణ్ చిన్నప్పుడు ఇలా ఉండేవారా? వీళ్లు స్టార్స్ అంటే నమ్మలేం!
టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రస్తుత లుక్ కి చిన్నప్పటి లుక్ కి అసలు పొంతన ఉండదు. మన టాలీవుడ్ స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు చూస్తే షాక్ అవుతారు. మనం ఆరాధించే హీరోలు ఇలా ఉన్నారు ఏంటని ఆశ్చర్యపోతారు..
గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ మహేష్ బాబు. బాలనటుడిగానే స్టార్ హోదా దక్కించుకున్న ఈ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ తిరుగులేని స్టార్ డమ్ సంపాదించారు. బాల్యంలో ఈ మిల్కీ బాయ్ ఎలా ఉన్నాడో మీరే చూడండి.
చిరంజీవి స్థాపించిన లెగసీని ముందుకు తీసుకెళ్లిన స్టార్ పవన్ కళ్యాణ్. ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల చిన్నప్పటి లుక్స్ మనం చూడొచ్చు.
బ్లాక్ బస్టర్ విజయాలతో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. డాన్స్ లలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. దేశం మెచ్చిన పుష్పరాజ్ చిన్నప్పుడు ఇలా ఉండేవాడు.
మెగాస్టార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డ్స్ తుడిపెట్టాడు రామ్ చరణ్. నటనతో పాటు డాన్స్ లలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటో చూడండి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఎన్టీఆర్ బాల్యంలోనే నటుడిగా సత్తా చాటాడు. పదేళ్లు కూడా దాటకుండానే రాముడిగా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ స్టార్. ఇది ఆయన చిన్నప్పటి ఫోటో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ అంటే కనీసం ఐదు వందల కోట్లు కావాలి. బాలీవుడ్ బడా ఖాన్ లకు కూడా చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఓ లుక్ వేయండి.
టాలీవుడ్ హల్క్ రానా... విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. భల్లాల దేవగా పాన్ ఇండియా పాపులారిటీ రాబట్టిన రానా, చిన్నప్పుడు ఇలా అమాయకంగా ఉండేవాడు.
రౌడీ విజయ్ దేవరకొండ ఫేమ్, ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బోల్డ్ యాటిట్యూడ్ తో యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ చిన్నప్పుడు ఇలా బొద్దుగా ఉండేవాడు.
డైరెక్టర్ అవుదామని వచ్చి హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ గా పేరుగాంచిన నాని వరుస విజయాలతో జోరుమీదున్నాడు. నాని చిన్నప్పటి ఫోటో ఇది.
ఏడాది ప్రాయంలోనే వెండితెరకు పరిచయమై హిట్ కొట్టాడు అక్కినేని హీరో అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు.