ఆ సూపర్ హిట్ మూవీ వద్దనుకున్న ప్రభాస్.. హీరోయిన్ ని మధ్యలోనే తీసేసి, చాలా రచ్చ జరిగిందిగా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై తన సత్తా చాటాడు. కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై తన సత్తా చాటాడు. కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రభాస్ యాక్షన్ చిత్రాలతో పాటు ఫ్యామిలీ స్టోరీలు, ప్రేమ కథలు కూడా చేశారు.
ప్రభాస్ నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ చిత్రాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దశరథ్ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కింది. ప్రభాస్ సరసన కాజల్, తాప్సి హీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్రానికి దిల్ రాజు ప్రభాస్ ని ఒప్పించే క్రమంలో చాలా పెద్ద తతంగమే జరిగిందట. ఓ చిత్ర షూటింగ్ లో ప్రభాస్ మలేషియాలో బిజీగా ఉన్నారు. ఆ టైం లో ప్రభాస్ కోసం దిల్ రాజు ఒక కథ రెడీ చేశారు. మలేషియా వెళ్లి ప్రభాస్ కి కథ వినిపించారట.
ప్రభాస్ కి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ నచ్చలేదట. దిల్ మార్పులు చేయిస్తా అని చెప్పారట. ఇండియా వచ్చాక పూర్తి కథ వినమని దిల్ రాజు చెప్పారు. కానీ ఇండియా వచ్చాక ప్రభాస్ మనసు మారిపోయింది.
ఆ చిత్రం చేయకూడదు అని డిసైడ్ అయ్యాడట. దిల్ రాజు కథ చెబితే విని నో చెబుదాం అనుకున్నాడట. కానీ మార్చిన కథ విన్న తర్వాత ప్రభాస్ కి తెగ నచ్చేసిందట. నేను నో చెబుదాం అనుకున్నాను.. భలే మ్యాజిక్ చేసావ్ డీలర్ రాజు అని ప్రభాస్ చెప్పాడట.
సినిమా మొదలైంది.. రకుల్ హీరోయిన్ గా షూటింగ్ లో పాల్గొంది. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత రకుల్ ఈ చిత్రాన్ని ఫిట్ కాదని ఆమెని తొలగించారు. కాజల్ ని తీసుకుందాం అని దిల్ రాజు చెప్పాడట. కాజల్ తో ఆల్రెడీ డార్లింగ్ మూవీ చేస్తున్నాను అని ప్రభాస్ చెప్పాడట. అయినా పర్వాలేదు అది వేరే కథ.. ఇది వేరే కథ అని కాజల్ ని ఫైనల్ చేశారు.