ప్రభాస్ 'ఫౌజీ' OTT హక్కులు అన్ని కోట్లకు అమ్ముడయ్యాయా?
ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా ఓటీటీ హక్కులు 150 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1947 నాటి నేపథ్యంలో యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథ.
Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers
ప్రభాస్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన సినిమా ప్రారంభం కాకుండానే బిజినెస్ లు అయ్యిపోతున్నాయి. ఓటిటి సంస్దలు అయితే ప్రభాస్ తో సినిమా చేస్తున్న నిర్మాతలు చుట్టూ ఆఫర్స్, నెగోషియేయన్స్ అంటూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ తో మైత్రీ సంస్థ ఓ ప్రెస్టీజియస్ సినిమాను ప్లాన్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ టైటిల్ తో ఆ టైటిల్ రూపొందుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అప్పుడే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.
ఫౌజీ అంటే అర్దం సైనికుడు. ఈ సినిమా యుద్దం నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామా కావటం విశేషం. సీతారామం కూడా దాదాపు ఇలాంటి నేపధ్యమే. ఇక ఫౌజీ అనేది వర్కింగ్ టైటిల్ అని, ప్యాన్ ఇండియా మార్కెట్ సరపడ టైటిల్ అవుతుందని ఇదే లాక్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా 1947 కాలంలో జరుగుతుంది.
బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జియర్ కథ ఇది అని సమాచారం. మైత్రీమూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ చాలా కాలంగా జరుగుతోంది. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమలో హీరోయిన్ గా కనిపించబోతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తారు. ఆల్రెడీ షూట్ మొదలయియందని సమాచారం.
ఈ క్రమంలో ఫౌజీ డిజిటల్ హక్కులు 150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ రైట్స్ కాకుండా శాటిలైట్లు, అడియో, హిందీ ఇలా ఇంకా వుంటాయి. అన్నీ కలిపి మరో 150 కోట్లకు పైగా వస్తాయని అంచనా అంటే ఒక్క నాన్ థియేటర్ హక్కులే 300 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక థియేటర్ బిజినెస్ అయితే చెప్పక్కర్లేదు.
డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెప్పటంతో ఖచ్చితంగా కొత్త కథ చూడబోతున్నారనే ఆనందం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని వినికిడి. అలాగే యుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో హను, ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకముందు కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు.