Anushka Shetty: అనుష్క లైఫ్ లో ఎఫైర్ రూమర్స్... ఆ హీరోలతో స్వీటీకి ఉన్న బంధం ఎలాంటిది?
వివాదరహితురాలిగా పేరున్న అనుష్క లైఫ్ లో ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. స్టార్ హీరోలతో ఆమె రిలేషన్ నడిపారని పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. అవేమిటో చూద్దాం..
Anushka Shetty
అనుష్క శెట్టి బర్త్ డే నేడు. అనుష్క నేడు 42 ఏట అడుగుపెట్టింది. పెళ్లంటే నో అంటున్న అనుష్క జీవితంలో ఎఫైర్ రూమర్స్ కి కొదవలేదు. అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 18 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతల హీరోయిన్ గా ఆమె ఉన్నారు.
Anushka Shetty
సోషల్ మీడియాలో కూడా అనుష్క చాలా సైలెంట్. తన ఫ్యామిలీ, పరిశ్రమలో అతి దగ్గర వ్యక్తులకు సంబంధించిన విషయాలపై మాత్రమే స్పందిస్తారు. మిస్ పర్ఫెక్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనుష్కపై ఎఫైర్ రూమర్స్ రావడం అనూహ్య పరిణామం.
Prabhas-Anushka
ముఖ్యంగా ప్రభాస్, అనుష్కల పెళ్లి మ్యాటర్ చాలా కాలంగా నడుస్తుంది. మా మధ్య ఏమీ లేదు, మంచి మిత్రులం మాత్రమే అని వీరిద్దరూ ఎన్ని సార్లు మొత్తుకున్నా... ఫ్యాన్స్, మీడియా మాత్రం నమ్మడం లేదు. బాహుబలి సినిమా సమయంలో మొదలైన అనుష్క, ప్రభాస్ పెళ్లి రూమర్ చాలా ఏళ్ళు హల్చల్ చేసింది.
Prabhas-Anushka
సాహో మూవీ ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చక్కర్లు కొట్టాడు ప్రభాస్. ఎక్కడికి వెళ్లినా ఆయనను వెంటాడిన ప్రశ్న.. అనుష్కతో పెళ్లి. అయితే ప్రభాస్ కంటే ముందే అనుష్క విషయంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వినిపించాయి.
Anushka-Gopichand
హీరో గోపీచంద్-అనుష్క లవ్ పడ్డారనే ఓ పుకారు ఉంది. యజ్ఞం మూవీతో హీరోగా నిలదొక్కుకున్న గోపీచంద్ లక్ష్యం రూపంలో భారీ హిట్ కొట్టాడు. ఈ మూవీలో గోపి చంద్ కి జంటగా అనుష్క శెట్టి నటించారు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో శౌర్యం మూవీ రాగా, అది కూడా విజయం అందుకుంది.ఈ సమయంలో అనుష్క, గోపీచంద్ మధ్య ప్రేమ చిగురించినట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నారని వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ పుకార్లు పుకార్లుగానే మిగిలిపోయాయి.
Anushka-Gopichand
వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉన్న నేపథ్యంలో, ప్రేక్షకులు సైతం వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్నారు. ఈ వ్యవహారంలో అనుష్క, గోపిచంద్ నోరు మెదపలేదు. అయితే 2013లో గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్నారు.
అనుష్క డెబ్యూ మూవీ సూపర్. నాగార్జునతో అనుష్క మంచి అనుబంధం కలిగి ఉన్నారు. సూపర్ అనంతరం, డాన్, కేడి చిత్రాల్లో అనుష్క, నాగార్జున జంటగా నటించారు. కింగ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ క్రమంలో నాగార్జున-అనుష్క మధ్య ఎఫైర్ అంటూ వార్తలొచ్చాయి.
Anushka Shetty
అనంతరం రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ , అనుష్క ప్రేమించుకున్నారంటూ ఓ పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్ళను ఒప్పింది అనుష్కను వివాహం చేసుకోవాలని అనుకున్నారట.
Anushka Shetty
సెంథిల్ కుమార్, అనుష్క పెళ్లి కథనాలు అప్పట్లో సంచలనం రేపాయి. కారణం ఏదైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు నిర్ణయం మార్చుకున్నట్లు మరలా సమాచారం. ఇక 2009లో రూహి అనే అమ్మాయిని సెంథిల్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి హాజరై అనుష్క సందడి చేశారు.