- Home
- Entertainment
- ప్రభాస్-మారుతి మూవీ బ్యాక్ డ్రాప్ లీక్... ఇదేం ట్విస్ట్ బాబోయ్ పాన్ ఇండియా స్టార్ కి సెట్ అవుతుందా!
ప్రభాస్-మారుతి మూవీ బ్యాక్ డ్రాప్ లీక్... ఇదేం ట్విస్ట్ బాబోయ్ పాన్ ఇండియా స్టార్ కి సెట్ అవుతుందా!
దర్శకుడు మారుతితో ప్రభాస్ మూవీ ఖాయమే. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కెరీర్ లో మొదటిసారి మారుతి స్టార్ హీరోతో మూవీ చేస్తున్నారు. కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతి ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేస్తాడనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉండగా ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.

ప్రభాస్(Prabhas) నటిస్తున్న మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండగా, ప్రాజెక్ట్ కే, సలార్ (Salaar)చిత్రీకరణ దశలో ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మధ్యలో దర్శకుడు మారుతితో మూవీ చేస్తున్నట్లు ప్రభాస్ తెలియజేశారు. దసరాకు మారుతి-ప్రభాస్ ల మూవీ పూజా కార్యక్రమం జరుపుకోనుందని సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తుండగా అనుష్క, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించనున్నారు.
కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతి(Maruthi) ప్రభాస్ తో ఎలాంటి మూవీ చేస్తారనే సందేహం అందరిలో ఉంది. ఈ పాన్ ఇండియా స్టార్ కోసం ఆయన ఎలాంటి కథ సిద్ధం చేశారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ లీకైంది. ఇది హారర్ కామెడీ మూవీగా తెరకెక్కుతుందట. నమ్మడానికి వింతగా ఉన్నా... ఇదే నిజమంటున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం ఓ పాడుబడిన థియేటర్ సెట్ లో నడుస్తుందట. తక్కువ రోజుల్లో ఆ సెట్స్ మారుతి మూవీ పూర్తి చేయనున్నాడట.
ప్రభాస్ లాంటి హీరోతో హారర్ కామెడీ చిత్రం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో మారుతి ప్రేమకథా చిత్రం అనే మూవీకి రచయితగా పనిచేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్ ని కామెడీ హారర్ జోనర్ చూపించడం అంటే మామూలు సాహసం కాదు. ఏమాత్రం తేడా కొట్టినా దారుణమైన ఫలితాలు చూడాల్సి వస్తుంది. ప్రభాస్ ని ఒప్పించాడంటే స్క్రిప్ట్ లో మేటర్ ఉండే ఉంటుంది. ప్రచారమవుతున్న ఈ న్యూస్ లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ అందరూ షాక్ కి గురవుతున్నారు.
మరోవైపు మారుతి లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మేకర్స్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్లు చెబుతున్నా రియాలిటీ మాత్రం వేరు. పక్కా కమర్షియల్ చిత్రాన్ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఆయనతో మూవీ వద్దు బాబోయ్ అంటున్నారు. మారుతితో మూవీ చేసే ఆలోచన ప్రభాస్ విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారికంగా ఈ మూవీ ఫైనల్ అయిపోయింది. ఇక వెనక్కి తగ్గేది లేదన్నట్లు ప్రభాస్ ముందుకు వెళుతున్నారు. మారుతి టీం ఆఫ్ రైటర్స్ తో స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. దీని కోసం మారుతి నిర్మాతలను కొంత సమయం అడిగారట. మొత్తంగా ప్రభాస్ ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జోనర్లో చేస్తూ ఫ్యాన్స్ కి విభిన్న చిత్రాలు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు.