#Kalki 3వ వారంలో ఎన్ని థియేటర్స్ లో రన్ అవుతుందో తెలిస్తే మతి పోతుంది!!
మూడో వారంలో సినిమా భారతీయుడు2(Bharateeyudu2 Movie) నుండి పోటిని తట్టుకుని కూడా ఇండియాలో ఆల్ మోస్ట్ 2000 వరకు థియేటర్స్ లో రన్ అవుతూ ఉంది.

ప్రభాస్ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూడో వారంలోకి ప్రవేశించింది. అయినా తగ్గేదేలే అన్నట్లు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1000 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు (kalki 2898 ad collection worldwide) చేసినట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో మూడో వారానికి ఈ చిత్రానికి ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అనేది చూద్దాం
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సెకండ్ వీక్ కు 1000 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా మూడో వారంలో కొత్త సినిమాల రిలీజ్ అవటంతో కాస్త తగ్గాయి. అయితే వీకెండ్ లో మరోసారి నైజాంలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ 150 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలు కలిపి… 400 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తోంది.
ఓవరాల్ గా మూడో వీక్ లో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 550 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తోంది. అలాగే నార్త్ బెల్ట్ లో హిందీ వెర్షన్ కు ఈ సినిమా 1200 వరకు స్క్రీన్స్ లో మూడో వీక్ ని కొనసాగిస్తూ ఉంది.
రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 200 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. వాస్తవానికి మూడో వారంలో సినిమా భారతీయుడు2(Bharateeyudu2 Movie) నుండి పోటిని తట్టుకుని కూడా ఇండియాలో ఆల్ మోస్ట్ 2000 వరకు థియేటర్స్ లో రన్ అవుతూ ఉంది.
Kalki Amitabh’s 55-year career
ఓవర్సీస్ థియేటర్స్ తో కలిపి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 2600 వరకు థియేటర్స్ లో రన్ అవుతుంది .రెండో వారం లో 4500 వరకు థియేటర్స్ లో రన్ అయిన సినిమా మూడో వారం లో కూడా సాలిడ్ హోల్డ్ నే చూపిస్తోంది. ఈ రేంజిలో మాగ్జిమం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించటంతో అదే నిష్పత్తిలో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.
Director Nag Ashwin
మరోవైపు హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్, అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్, నాగ్ అశ్విన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రూ.220 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన మూవీగా ‘కల్కి’ నిలిచింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు దాటి వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం.
భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. సెకండ్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్ గానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది. ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంటే... మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ కనపడుతోంది.
అయితే భారతీయుడు సినిమాకు నెగిటివ్ టాక్ రావటం, హిందీలో ఈ వారం రిలీజైన అక్షయ్ కుమార్ సినిమా డిజాస్టర్ అవటం కలిసొచ్చింది. అలాగే వీకెండ్ అడ్వాంటేజ్ కూడా సినిమాకి ఇప్పుడు ఉండటంతో కలెక్షన్స్ లో గ్రోత్ మరింతగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.
పోటిలో రిలీజ్ అయిన కొత్త మూవీస్ కన్నా కూడా… యునానిమస్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న కల్కి మూవీకి టికెట్ హైక్స్ కూడా ఇప్పుడు తగ్గిపోవడంతో సినిమాకి ఇప్పుడు వీకెండ్ లో మంచి ఆక్యుపెన్సీ సొంతం అయ్యే అవకాశం ఉంది, ఇక మరో వారం 10 రోజులు సినిమా ఇదే విధంగా జోరు కొనసాగించితే ప్రాఫిట్ అండ్ గ్రాస్ లెక్క ఆశ్చర్యపోయేలా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.