MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పవన్, సుజీత్, దానయ్య మూవీ.. తెరవెనుక ప్రభాస్ తో ఇంత పెద్ద తతంగం జరిగిందా ?

పవన్, సుజీత్, దానయ్య మూవీ.. తెరవెనుక ప్రభాస్ తో ఇంత పెద్ద తతంగం జరిగిందా ?

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్, సుజీత్ ల చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2022, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. అయితే భవదీయుడు చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంతలోనే పవన్ కొత్త మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చి అందరిని థ్రిల్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్, సుజీత్ ల చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అనౌన్సమెంట్ పోస్టర్ లో ఉన్న అంశాలు చర్చించుకుంటూ సినిమా ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ అప్పుడే ఊహల్లో తేలిపోతున్నారు. 

36

అయితే సడెన్ గా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటించడానికి కారణం ఏంటి ? సుజీత్ ని దర్శకుడిగా పెట్టి భారీ బడ్జెట్ లో సినిమా తెరెకెక్కించేందుకు దానయ్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సుజీత్, పవన్ మూవీ గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు లోకి దానయ్య ఎలా వచ్చారు ? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

46

అయితే పవన్, సుజీత్, దానయ్య మూవీ వెనుక ప్రభాస్ కేంద్రంగా చాలా పెద్ద తతంగమే నడిచింది అట. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ నుంచి మొదలు పెట్టాలి. రాధే శ్యామ్ చిత్రానికి బడ్జెట్, రిలీజ్ సమస్యలు తలెత్తినప్పుడు దానయ్య సాయం చేశారట. భారీగా ఆర్థిక సాయం చేసి ఆ చిత్రం రిలీజ్ అయ్యేలా చేశారట. దీనికి ప్రతిఫలంగా ఒక చిత్రం చేస్తానని ప్రభాస్ దానయ్యకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

56

అందువల్లే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో నటించేందుకు రెడీ అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్ల దానయ్య సంతృప్తిగా లేరో లేక ఇతర కారణాల వల్లో తెలియదు కానీ.. ఆయన ఈ చిత్రం నుంచి బయటకి వచ్చేశారు. తాను రాధే శ్యామ్ చిత్రం కోసం ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో వెంటనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రంగంలోకి దిగి.. ప్రభాస్, మారుతి చిత్రాన్ని టేక్ ఓవర్ చేసుకుందట. 

66

దానయ్యకు ఇవ్వాల్సిన మొత్తం పీపుల్స్ మీడియా వాళ్లే ఇచ్చేశారట. దీనితో దానయ్య వెంటనే పవన్, సుజీత్ కాంబినేషన్ పై ఫోకస్ పెట్టి ప్రాజెక్టు ఒకే చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభాస్ స్పోర్టివ్ గానే తీసుకున్నారట. దానయ్యతో ఇప్పటికీ మంచి రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్, సుజీత్ మూవీ ప్రకటన రాగానే ప్రభాస్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. బిజినెస్ వ్యవహారాలని, రిలేషన్ ని ప్రభాస్ కలిపి చూడరు అని మరోసారి రుజువైంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Recommended image2
Sancharame Folk Song : మనిషి జీవితాన్ని కొత్తగా చూపించే జానపదం... ఈ లిరిక్స్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..!
Recommended image3
Tollywood: మీడియం బడ్జెట్ సినిమాలతో బడా స్టార్లని తొక్కేశారు.. 100 కోట్ల లాభాలు తెచ్చిన ముగ్గురు హీరోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved