- Home
- Entertainment
- పహల్గాం దాడి ఎఫెక్ట్ : ప్రభాస్ 'ఫౌజి' నుంచి ఆమెని తొలగించాలి, హీరోయిన్ ఇమాన్విపై ట్రోలింగ్ ?
పహల్గాం దాడి ఎఫెక్ట్ : ప్రభాస్ 'ఫౌజి' నుంచి ఆమెని తొలగించాలి, హీరోయిన్ ఇమాన్విపై ట్రోలింగ్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు.

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. తన చిత్రాల్లో హను రాఘవపూడి కొత్త హీరోయిన్లని పరిచయం చేయడానికి ఇష్టపడుతుంటారు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో మెహ్రీన్ ని, అందాల రాక్షసి చిత్రంతో లావణ్య త్రిపాఠిని, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ ని పరిచయం చేసింది ఈ దర్శకుడే.
ప్రభాస్ ఫౌజి చిత్రం కోసం ఇమాన్వి అనే సోషల్ మీడియా సెలెబ్రిటీని హను రాఘవపూడి హీరోయిన్ గా తీసుకువచ్చారు. ఫౌజిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇమాన్వి సోషల్ మీడియాలో డ్యాన్సర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలాంటి అమ్మాయి ప్రభాస్ కి హీరోయిన్ గా నటిస్తుంది అంటే అందరిలో ఆసక్తి ఉండడం సహజం.
Imanvi
అయితే కశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్విపై ట్రోలింగ్ జరుగుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఊహించని విధంగా ఆమెకి వ్యతిరేకంగా నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ప్రభాస్ సినిమా నుంచి వెంటనే ఇమాన్విని తొలగించాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పహల్గాంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. దీనితో నెటిజన్లు పాకిస్తాన్ పై భగ్గుమంటున్నారు. ఇమాన్వి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని నెటిజన్లు కొందరు పేర్కొంటున్నారు.
Imanvi
అయితే ఇమాన్వి గురించి సరైన సమాచారం ఎక్కడా దొరకడం లేదు. ఆమె తండ్రి పాకిస్తాన్ లో మాజీ మిలిటరీ అధికారి అని నెటిజన్లు వాదిస్తున్నారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న నటీనటుల్ని చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇమాన్విని కూడా ప్రభాస్ మూవీ నుంచి వెంటనే తొలగించాలి అని పోస్ట్ లు పెడుతున్నారు. అయితే మరికొన్ని చోట్ల ఆమె బ్యాగ్రౌండ్ గురించి వేరుగా ఇన్ఫర్మేషన్ ఉంది.
Imanvi
ఇమాన్వి ఇండియాకి చెందిన అమ్మాయే అని.. ఆమె ఢిల్లీలో పుట్టింది అని కొన్ని చోట్ల సమాచారం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు అట. మొత్తంగా ఇమాన్వి బ్యాగ్రౌండ్ గురించి కన్ఫ్యూజన్ నెలకొంది. నెటిజన్లు ఏమో ఆమె పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అంటూ విరుచుకుపడుతున్నారు.