MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మారుతీకి ప్రభాస్ కండీషన్స్.. అందుకే హంగామా లేకుండా షూటింగ్ ప్రారంభం!

మారుతీకి ప్రభాస్ కండీషన్స్.. అందుకే హంగామా లేకుండా షూటింగ్ ప్రారంభం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - దర్శకుడు మారుతీ  కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి డార్లింగ్ కండీషన్స్ పెట్టారంట. ఇప్పటికే వరుసగా ఫ్లాప్స్ పడుతుండటంతో ప్రభాస్ ఈ సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 28 2022, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఫిల్మ్స్ తో అలరిస్తూనే ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ప్రస్తుతం అన్నీ భారీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్నారు. ‘బాహుబలి’ భారీ విజయవంతం కావడంతో కనీసం ఆ స్థాయిలోనే సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కానీ, ఫలితం లేకుండా పోతోంది. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ చిత్రాలు కూడా భారీ హైప్ ను క్రియేట్ చేసి.. థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దీంతో డార్లింగ్ తదుపరి చిత్రాలపై ఓ కీలక  నిర్ణయం తీసుకున్నారు. అన్ని యాక్షన్ సినిమాలతోనే కాకుండా కాస్తా ఈజీ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించినట్టు తెలుస్తోంది.
 

36

ఈ క్రమంలో దర్శకుడు మారుతీ (Maruthi)తో సినిమాకు ఓకే చెప్పారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ‘డీలక్స్ రాజా’ అనే క్రేజీ టైటిల్ ను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా చిత్రంపై మరో అదిరిపోయే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 

46

సైలెంట్ గా ప్రభాస్ మారుతీ దర్శకత్వంతో  నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మూడు రోజుల షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని అంటున్నారు. వారం రోజులు గల ఈ ఫస్ట్ షెడ్యూల్ లో మిగితా నాలుగు రోజుల్లో నటి రిద్ధి కుమార్, వైవా హర్షపై సీన్లను షూట్ చేస్తున్నట్టు సమాచారం. 
 

56

పొగ లేనిదే మంట రాదు అన్నట్లుగా.. షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం వీలుపడదు. అయితే ప్రభాస్ కండీషన్స్ మేరకే ఇలా జరుగుతుందంటున్నారు. మారుతీ దర్శకత్వంలో మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక రిజల్ట్ ను బట్టి సినిమాను కొనసాగించడమా? లేక ఆపేయడా? అన్న దానిపై ఓ నిర్ణయానికి వస్తారంట. ఇందుకోసమే ఎలాంటి ప్రకటన లేకుండా షూట్ ప్రారంభించారని అంటున్నారు. 
 

66

డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో హార్రర్ అండ్ కామెడీ జానర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్లుగా మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి డిటేయిల్స్ రానున్నట్టు తెలుస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image2
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image3
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved