MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌

Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌

Manchu Manoj: మంచు మనోజ్‌ తన ఫ్యామిలీ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రి, అన్నపై క్రేజీగా సెటైర్లు వేశారు. అదే సమయంలో తన భార్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 19 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బర్త్ డే స్పెషల్స్ ప్రకటించిన మంచు మనోజ్‌
Image Credit : Youtube/People Media Factory

బర్త్ డే స్పెషల్స్ ప్రకటించిన మంచు మనోజ్‌

మంచు మనోజ్‌ తన 43వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మరోవైపు పెళ్లి తర్వాత కెరీర్‌ పరంగా జోరు పెంచారు. ఇటీవల రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు హీరోగా `డేవిడ్‌ రెడ్డి` చిత్రంతో రాబోతున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మరికొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. అలాగే ఇటీవలే ఐక్య(AIKYA ధైర్య సేన సమితి) పేరుతో ట్రస్ట్ ని స్థాపించారు. సేవా కార్యక్రమాలను విస్తరించబోతున్నట్టు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సేవా కార్యక్రమాలు చేయబోతున్న మనోజ్‌
Image Credit : instagram/@manojkmanchu

సేవా కార్యక్రమాలు చేయబోతున్న మనోజ్‌

ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు మనోజ్‌. ఈ పుట్టిన రోజు స్పెషల్‌గా తన సేవా కార్యక్రమాలు విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి తన సొంత డబ్బుతోనే సేవ చేస్తానని, భవిష్యత్‌లో ఒక ప్లానింగ్‌ ప్రకారం సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఫ్యామిలీ వివాదం గురించి రియాక్ట్ అయ్యారు. ఆ విషయాన్ని వెళ్లి ఎవరిని అడగాలో ఆయన్ని అడగండి అని చెప్పారు మనోజ్.

Related Articles

Related image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Related image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
35
ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ కామెంట్‌
Image Credit : Asianet News

ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ కామెంట్‌

ఈ సందర్భంగా ఆయన తన ఫ్యామిలీ(తండ్రి మోహన్‌ బాబు, అన్న మంచు విష్ణు) పై సెటైర్లు వేశారు. ఎవరిని అడగాలో మీకు తెలుసు, వారినే అడగాలని, వెళ్లేటప్పుడు మైక్‌లు తీసుకుపోవద్దు, అలాగే హెల్మెట్లు పెట్టుకొని పోవాలి అని తెలిపారు మనోజ్‌. ఇలా సెటైరికల్‌గా తన వివాదాన్ని వెల్లడించారు. అదే సమయంలో మీకు న్యాయం జరిగిందా? మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారనే ప్రశ్నకి స్పందిస్తూ, తనకు న్యాయం జరిగిందని, యూనివర్స్‌ రూపంలో న్యాయం జరిగిందని తెలిపారు మంచు మనోజ్‌. ఇలా తన ఫ్యామిలీ వివాదంపై సెటైరికల్‌గా, ఫన్నీగా స్పందించారు.

45
రాజకీయాల్లోకి మౌనికా రెడ్డి
Image Credit : google

రాజకీయాల్లోకి మౌనికా రెడ్డి

ఇక ఈ సందర్భంగా తన భార్యకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన భార్య మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి వెళ్తారని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో లేదని  చెప్పారు. తమది రాజకీయ కుటుంబమే గానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. అదే సమయంలో తన భార్యది రాజకీయ కుటుంబమే కాబట్టి, ఆమె రాజకీయాల్లోకి వెళ్తుందని చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు ఆయన వెల్లడించారు.

55
మంచు ఫ్యామిలీ గొడవ ఏంటంటే?
Image Credit : google

మంచు ఫ్యామిలీ గొడవ ఏంటంటే?

గత ఏడాది క్రితం నుంచి తండ్రి మంచు మోహన్‌ బాబు, అన్నయ్య మంచు విష్ణులతో మనోజ్‌ గొడవ పడుతున్న విషయం తెలిసిందే. కాలేజీ, స్టూల్క్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్‌ ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న విద్యార్థులను భయపెడుతున్నారని, స్కూల్‌, యూనివర్సిటీలో స్కామ్‌లకు పాల్పడుతున్నారని మనోజ్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోనే మంచు విష్ణుకి, మనోజ్‌కి పడటం లేదని సమాచారం. అయితే ఇదంతా ఆస్తి గొడవలని ఇన్‌సైడ్‌ వర్గాల టాక్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మంచు మనోజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image3
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Related Stories
Recommended image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved