ఆదిపురుష్ 6 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రాబట్టాలి..?
ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ అయ్యి ఆరు రోజులు అవుతోంది. వివాదాలకు కేంద్రంగా మారుతున్న ఈసినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధించింది. ఇప్పటి వరకూ ఆదిపురుష్ కలెక్షన్స్ ఎంత..? ఆ 6 రోజుల్లో వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..

గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ హీరోయిన్ కృతీసనన్ సీతగా నటించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రావణ బ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్.. లక్ష్మనుడిగా సన్నీ సింగ్ నటించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. మొదటి నంచి నెగెటీవ్ టాక్.. రిలీజ్ అయిన తరువాత వివాదాలులతో ఆదిపురుష్ హడావిడి అంతా ఇంతా కాదు. నెగెటీవ్ టాక్ ఉన్నా.. మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కాలెక్షన్లు సాధించిన ఆదిపురుష్ మూవీ.. ఆతరువాత నుంచి కలెక్షన్స్‌లలో భారీగా పతనం నమోదు చేసింది. మొత్తంగా ఈ సినిమా 6 రోజుల్లో వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
అందుకే రామాయణంలో కొన్ని భాగాలు తీసుకుని చేశామంటూ ముందు ప్రకటించిన టీమ్.. ఈసినిమాను పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించారంటూ.. సినిమాపై రామ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యాక్తం చేస్తున్నారు. హిందు సంగాలు కూడా ఈ సినిమాపై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాతో తమ మనోభావాలను గాయపరిచాడంటూ ఆయన పై దుమ్మెత్తి పోస్తున్నారు
అంత నెగెటీవ్ టాక్ ఉన్నా.. మొదటి మూడు రోజులు కెక్షన్లు ఊపేసింద ఆదిపురుష్.. ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది ఆదిపురుష్ సినిమా . హిందీ బెల్ట్ ఏరియాల్లో దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అయ్యింది. అడ్వాన్స్ బుక్కింక్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే అంచాలనకు మించి వసూళ్లను రాబట్టింది ఆదిపురుష్. . ఆ తర్వాత రెండు రోజులు కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టిన ఆదిపురుష్.. సోమవారం నుంచి కలెక్షన్స్‌లలో భారీ పతనం చూసింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ ఆరు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలంగాణ (నైజాం) .. 33.87 కోట్లు.. రాయలసీమ (సీడెడ్).. 8.89 కోట్లు.. ఉత్తరాంధ్ర.. 9.52 కోట్లు.. తూర్పు గోదావరి.. 5.55 కోట్లు.. పశ్చిమ గోదావరి.. 3.91 కోట్లు.. గుంటూరు.. 6.35 కోట్లు.. కృష్ణా.. 4.14 కోట్లు.. నెల్లూరు.. 2.07 కోట్లు.. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ కలిపి 74.30 కోట్లు.. శేర్ ను రాబట్టింది ఆదిపురుష్.. అంటే దాదాపు 118.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఇక మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆధారంగా చూస్తే.. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ 410 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు రిలీజ్ చేసారు. మొత్తంగా ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి, బాహుబలి 2, సాహో తర్వాత నాల్గో 400 కోట్ల సినిమాగా ఆదిపురుష్ రికార్డులకు ఎక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ముందుగా మన దేశంలో.. కర్ణాటక ... 11.55 కోట్లు.. తమిళనాడు.. 2.26 కోట్లు.. కేరళ.. 0.80 కోట్లు.. హిందీ మరియు రెస్టాఫ్ భారత్.. 63.80 కోట్లు.. ఓవర్సీస్.. 23.05 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ 175.76 కోట్లు.. రాబట్టింది ఆదిపురుష్. ఈలెక్కన గ్రాస్ 355.00 కోట్లుగా తెలుస్తోంది. ప్రీరిలీజ్ బిజినెస్ లో కూడా సత్తా చాటిన ఈమూవీ 240 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా 66 . 24 కోట్లు రాబడితే.... హిట్ సినిమాగా నిలిచే అవాకశం ఉంది
అయితే ఆదిపురుష్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసన మొదలయ్యింది. రామాయణాన్ని వక్రీకరించారని..ఓం రౌత్ రామాయణం తీస్తానని చెప్పి ఇలా చేశాడంటూ.. మండిపటం మొదలు ప్టెట్టారు ఆడియన్స్. ఈ కాంట్రవర్సీఆదిపురుష్ కలెక్షన్స్ పెరగడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. సినిమాలో అసలు ఏముందా అని చూడటానికి వెళ్ళేవాళ్లు కూడా లేకపోలేదు.