Prabhas Promotions: సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ ను గట్టిగా వాడేస్తున్న మేకర్స్.
వరుసగా భారీ బడ్జెట్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు ప్రభాస్. వరుస సినిమాలు.. ఒకదాని వెంట మరోకటి.. తన సినిమా ప్రమోషన్లు.. ఇలా ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా సరే..ఇతర సినిమాల ప్రమోషన్లు కూడా చేయడానికి ముందుకు వస్తున్నాడు ప్రభాస్.

చిన్న సినిమా.. పెద్ద సినిమా అని లేదు. తన అవసరం ఉన్న ప్రతీ సినిమాకు అడగ్గానే సాయం చేస్తన్నాడు యంగ్ రెబల్ స్టార్. ఊహూ అనకుండా.. ఇంటర్వ్యూలు, ఇవెంట్లు చేసి పెట్టాడు.. పెడుతున్నాడు కూడా. మేకర్స్ కూడా ప్రభాస్ ఇమేజ్ ను గట్టిగా వాడుకుంటున్నారు.
ప్రభాస్ చేత ప్రమోషన్లు చేయించాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ చిన్న ఛేంజ్ ఏంటీ అంటే.. ప్రశాంత్ నీల్ చేయించబోయేది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సలార్ మూవీకి కాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కన్నడ పాన్ ఇండియా మూవీ కెజీయఫ్2 మూవీకి.
దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కేజియఫ్2 ఒకటి. ఈసినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. సలార్ ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి కెజియఫ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ విషయంలో ప్రభాస్ సాయం తీసుకోబోతున్నాడట ప్రశాంత్ నీల్.
కెజియఫ్ ఛాప్టర్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా ప్రభాస్ ను ఇన్వైట్ చేశాడట ప్రశాంత్ నీల్. ఇదొక్కటే కాదు, కెజియఫ్2 ఇంటర్వ్యూస్ లో ప్రభాస్ ను కూడా ఇన్వాల్స్ చేయాలని చూస్తున్నాడు. ప్రభాస్ జాయిన్ అయితే ఈమూవీ క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు. ఎలాగైనా ప్రభాస్ ను ఒప్పించి మరికొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడట ప్రశాంత్ నీల్.
ఇక ప్రభాస్ ను ఇంతకు ముందు కూడా చాలా సినిమాల కోసం వాడేసుకున్నారు మేకర్స్. రీసెంట్ గా రాజమౌళి కూడా ట్రిపుల్ ఆర్ సినమా కోసం ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఫన్నీగా.. ఈ సినిమాకి నన్నెందకు తీసుకోలేదు అని కూడా అడిగాడు. అయితే జక్కన్నతో ఉన్న చనువుతో ప్రభాసే స్వయంగా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేశాడని అంటున్నారు.
ఇక గతంలో మరికొన్ని సినిమాలకు కూడా ప్రభాసే స్వయంగా ప్రమోషన్ చేశాడు. ముఖ్యంగా తనకు బుజ్జిగాడు లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చిన పూరీ జగన్నాథ్ కోసం.. పూరీ కొడుకు ఆకాశ్ రొమాంటిక్ సినిమాను ప్రమోట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా విషయంలో కూడా ప్రభాస్ స్వయంగా పూరీకి ఫోన్ చేసి మరీ... రొమాంటిక్ మూవీని ప్రమోట్ చేస్తానన్నాడట డార్లింగ్.
ప్రభాస్ మరో చిన్న సినిమా ప్రమోషన్ లో కూడా సందడి చేశాడు. ఆ మధ్య చిన్న సినిమాగా వచ్చి రచ్చ రచ్చ చేసిన జాతిరత్నాలు మూవీ ప్రమోషన్ లో కూడా ప్రభాస్ పాల్గొన్నారు. ఆ టైమ్ లో ఆదిపురుష్, సలార్, రాధేశ్యామ్ బిజీలో ఉన్నా కాని.. టీమ్ ను ముంబయ్ కి రప్పించుకుని మరీ.. తన ఫ్లాట్ లోనే ఫన్నీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుని మరీ జాతిరత్నాలుకు బూస్టప్ ఇచ్చాడు ప్రభాస్. ఇలా ప్రభాస్ ఇష్ట ప్రకారం.. మేకర్స్ ప్లాన్ ప్రకారం ప్రభాస్ ను ప్రమోషన్స్ కు పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు మేకర్స్.