MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెంచాగిరి, డ్రామాలు ఈ పదాలు ఇప్పుడు అవసరమా పోసాని.. కైకాల మృతిపై షాకింగ్ కామెంట్స్

చెంచాగిరి, డ్రామాలు ఈ పదాలు ఇప్పుడు అవసరమా పోసాని.. కైకాల మృతిపై షాకింగ్ కామెంట్స్

తెలుగు వారి యమధర్మరాజు వెండితెరపై యముండ అంటూ గాండ్రించిన కైకాల సత్యనారాయణ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. నేడు కైకాల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 24 2022, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు వారి యమధర్మరాజు వెండితెరపై యముండ అంటూ గాండ్రించిన కైకాల సత్యనారాయణ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. నేడు కైకాల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. 6 దశాబ్దాల కాలం పాటు కైకాల నట జీవితంలోనే గడిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాం నుంచి ఇప్పటి తరం వరకు కైకాల ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన పాత్రలు చేశారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా తెలుగు వారికి యముడు అంటే గుర్తుకు వచ్చేది ఆయన రూపమే. కైకాల తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ , బ్రహ్మానందం లాంటి ప్రముఖులంతా కైకాలకి నివాళులు అర్పించారు. 

36

తరచూ వివాదాల్లో నిలిచే నటుడు పోసాని కైకాల మృతి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోసానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సీఎం జగన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. పొలిటికల్ కార్యక్రమాల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడే పోసాని.. కైకాల మృతి విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

46

పోసాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఏదో అటెన్షన్ పొందాలని తపిస్తునట్లు ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కైకాలని ప్రశంసిస్తూనే రాజకీయ ఉద్దేశం ఉన్నట్లుగా కొన్ని కామెంట్స్ చేశారు. ' చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయతీగా బతికినవాడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంత కాలం కాకపోయినా సినీ కళాకారులు ఉన్నంతకాలం బతికి ఉండే నటుడు కైకాల.. జోహార్' అంటూ పోసాని కామెంట్స్ చేశారు. 

56

ఈ సమయంలో కూడా చెంచాగిరి, డ్రామాలు అంటూ పొలిటికల్ ప్రెస్ మీట్స్ లో వాడే పదాలు ఎందుకు అంటూ నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం కైకాల గురించి పాజిటివ్ గానే కదా చెప్పారు.. అలా మాట్లాడడం పోసాని శైలి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. 

66

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిలిం నగర్ లోని తన నివాసంలో కైకాల మరణించారు. కైకాల మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  కైకాల సత్యనారాయణ ఇండస్ట్రీలో అందరి మనిషిగా మెలిగారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved