- Home
- Entertainment
- Posani: చిరంజీవి సినిమా కాబట్టి వల్గర్ మూవీ అన్నారు, అసలు సిసలైన చెత్త సినిమా అదే..దెబ్బకు అంతా సైలెంట్
Posani: చిరంజీవి సినిమా కాబట్టి వల్గర్ మూవీ అన్నారు, అసలు సిసలైన చెత్త సినిమా అదే..దెబ్బకు అంతా సైలెంట్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన వల్గర్ మూవీ చిరంజీవి సినిమా కాదు, మరో సినిమా ఉంది అంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Posani Krishna Murali
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. మాస్ సినిమాలతో అభిమానులని ఉర్రుతలూగించారు. అదే విధంగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేశారు. చిరంజీవి కెరీర్ లో అత్యంత వివాదభరిత చిత్రం అంటే అల్లుడా మజాకా అనే చెప్పాలి. ఈవీవీ సత్యానారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రంభ హీరోయిన్లుగా నటించారు.
పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు
ఈ మూవీలో అసభ్యకర సన్నివేశాలు, డైలాగులు, డ్యాన్సులు ఎక్కువగా ఉన్నాయి అంటూ అప్పట్లో మహిళా సంఘాలు మండిపడ్డాయి. అల్లుడా మజాకా చిత్రం చిరంజీవి కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ చిత్రానికి పోసాని కృష్ణ మురళి రచయితగా పనిచేశారు. అల్లుడా మజాకా వల్గర్ మూవీ అంటూ వచ్చిన విమర్శలపై పోసాని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
మహిళలే ఎక్కువగా ఆదరించారు
అల్లుడా మజాకా చిత్ర కథకు ఎక్కువ వెర్షన్లు రాయలేదు. ఒకటి రెండు రాశాము. అవే ఓకె అయ్యాయి. అందులో ఎలాంటి వల్గారిటీ లేదు. చిరంజీవి గారు తెల్ల చొక్కా లాంటి వ్యక్తి. చిన్న సిరా చుక్క పడినా పెద్ద మచ్చగా చూపించి గోల గోల చేసేవాళ్ళు ఉన్నారు. అల్లుడా మజాకా మూవీ విషయంలో కూడా అలాగే చేయాలని అనుకున్నారు. వాస్తవానికి అల్లుడా మజాకా చిత్రం సూపర్ హిట్ మూవీ. మహిళలు ఎక్కువగా ఆదరించారు.
వల్గర్ మూవీ అంటూ విమర్శలు
మహిళల కోసం ప్రత్యేకంగా షోలు కూడా ప్రదర్శించారు. అది వల్గర్ మూవీ అయితే మహిళలు అంతగా ఎందుకు ఆదరిస్తారు అని పోసాని అన్నారు. అల్లుడా మాజాకా రిలీజ్ అయినప్పుడు సారథి స్టూడియోలో ఒక మీటింగ్ జరిగింది. మీడియా ప్రతినిధులు వచ్చారు. మురళి మోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అల్లుడా మజాకా చిత్రం వల్గర్ మూవీ అంటూ మీడియా ప్రతినిధులు నన్ను ప్రశ్నించారు.
అసలైన వల్గర్ మూవీ అదే
ఆ మీటింగ్ లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నాసరే.. నేను తిరిగి ఒక ప్రశ్న అడిగాను. అసలు అల్లుడా మజాకాలో అంత వల్గర్ గా ఏముంది ? నిజంగా అది వల్గర్ మూవీ అయితే మహిళలు ఎందుకు చూస్తున్నారు అని తిరిగి ప్రశ్నించా. అది సరే మీకు అసలైన వల్గర్ మూవీ గురించి చెబుతా. రామోజీ రావు గారు స్వయంగా నిర్మించిన చిత్రం అది. పేరు మౌనపోరాటం. వినోద్, యమున నటించారు. ఆ మూవీలో ట్రైన్ సీన్ లో హీరోయిన్ పై తేనె పడుతుంది. దానిని హీరో నాకుతాడు. అది కదా వల్గారిటీ అంటే. వల్గర్ మూవీ అంటే అది కాదా ? అని తాను ప్రశ్నించినట్లు పోసాని తెలిపారు. అక్కడున్న వాళ్ళు ఒక్కరు కూడా నోరు మెదపలేదు అని పోసాని అన్నారు. మౌనపోరాటం గురించి ఎందుకు మాట్లాడరు అంటే అది రామోజీ రావు గారి సినిమా కాబట్టి. చిరంజీవి సినిమాని మాత్రం ఈజీగా టార్గెట్ చేయొచ్చు అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

