MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Sridevi: స్టార్ హీరో ముఖంపై కాండ్రించి ఉమ్మిన శ్రీదేవి, కన్నీరుపెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Sridevi: స్టార్ హీరో ముఖంపై కాండ్రించి ఉమ్మిన శ్రీదేవి, కన్నీరుపెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Sridevi: అందాల నటి శ్రీదేవి కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో నచ్చని పనులు కూడా చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఓ సినిమాలో సీన్ కోసం.. స్టార్ హీరో ముఖాన కాండ్రించి ఉమ్మడానికి శ్రీదేవి ఎంత భయపడిందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 14 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు..
Image Credit : Twitter

సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు..

సినిమా రంగంలో ఒక అద్భుతమైన సన్నివేశం తెరపైకి రావడానికి నటీనటులు, దర్శకులు పడే శ్రమ, వారి మధ్య ఉండే అవగాహన ఎంత ముఖ్యమో తెలియజేసే ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. అలాంటి వాటిలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, దివంగత నటి శ్రీదేవి, లెజెండరీ దర్శకుడు భారతీరాజా కాంబినేషన్‌లో జరిగిన ఒక ఎమోషనల్ సంఘటన ఇప్పటికీ సినీ వర్గాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
16 ఏళ్ల వయసు (16 వయదినిలే) సినిమా నేపథ్యం..
Image Credit : X

16 ఏళ్ల వయసు (16 వయదినిలే) సినిమా నేపథ్యం..

భారతీరాజా దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ చిత్రం '16 వయదినిలే'. తెలుగులో ఈ సినిమాను '16 ఏళ్ల వయసు' గా రీమేక్ చేశారు. ఈ చిత్రంలో ఒక కీలక సన్నివేశంలో కమల్ హాసన్‌ను రజినీకాంత్ తీవ్రంగా కొడతాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శ్రీదేవి, రజినీకాంత్‌తో గొడవ పడుతూ తీవ్ర కోపంతో అతని ముఖంపై కాండ్రించి ఉమ్మివేయాల్సి ఉంటుంది.

35
ససేమీరా అన్న శ్రీదేవి:
Image Credit : Facebook/Sridevi Kapoor

ససేమీరా అన్న శ్రీదేవి:

ఈ సన్నివేశాన్ని సహజంగా చూపించడం కోసం మొదట మూవీ టీమ్ సబ్బు నురగను ఉపయోగించి షూట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ, అది కెమెరాలో ఏమాత్రం సహజంగా అనిపించలేదు. దాంతో చిత్రయూనిట్ కాసేపు తర్జనభర్జన పడింది. ఈ గందరగోళాన్ని గమనించిన రజినీకాంత్ ఏమాత్రం భేషజం లేకుండా, "సన్నివేశం పండాలంటే నాపై నిజంగానే ఉమ్మి వేయమనండి" అని చెప్పారు. కానీ, అంతటి పెద్ద నటుడిపై నిజంగా ఉమ్మివేయడానికి శ్రీదేవి అస్సలు ఒప్పుకోలేదు. "ససేమీరా.. నేను అలా చేయలేను" అని చెబుతూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

45
రజినీకాంత్ నిబద్ధత:
Image Credit : X

రజినీకాంత్ నిబద్ధత:

శ్రీదేవి రజినీకాంత్ పై ఉమ్మడానికి నిరాకరించడంతో రజినీకాంత్ స్వయంగా ఆవిడను దర్శకుడు భారతీరాజా దగ్గరకు తీసుకెళ్లారు. సీన్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇది చేయక తప్పదని సూచించారు. మొదట్లో భారతీరాజా కూడా వద్దని వారించినప్పటికీ, రజినీకాంత్ పట్టుబట్టడంతో సుదీర్ఘ వాదనల తర్వాత ఎట్టకేలకు శ్రీదేవి ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఎంతో ఇబ్బంది పడుతూనే శ్రీదేవి ఆ కాండ్రించి ఉమ్మేసే సన్నివేశాన్ని పూర్తి చేశారు.

55
కన్నీరు పెట్టిన భారతీరాజా
Image Credit : X

కన్నీరు పెట్టిన భారతీరాజా

ఆ రోజు రజినీకాంత్ చూపించిన అంకితభావం, నటన పట్ల ఆయనకున్న నిబద్ధతను చూసి దర్శకుడు భారతీరాజా ఆశ్చర్యపోయారు. రజినీలోని గొప్ప నటుడిని చూసి ఎమోషనల్ అయ్యి.. భారతీరాజా కన్నీటి పర్యంతమవుతూ ఆయన్ని గట్టిగా హత్తుకున్నారు. "నటన అంటే కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, పాత్రకు తగ్గట్టుగా లీనమవ్వడం , నిబద్ధత కలిగి ఉండడం" అని రజినీకాంత్ నమ్మే సిద్ధాంతానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. దర్శకుడి విజన్‌ను గౌరవిస్తూ నటుడు తనను తాను పూర్తిగా సమర్పించుకుంటే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ సన్నివేశం నిరూపించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Related Stories
Recommended image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Recommended image2
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved