MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Tollywood Director: ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ కన్నుమూత.. శివాజీ, రమ్యకృష్ణల సినిమాతో పాపులర్

Tollywood Director: ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ కన్నుమూత.. శివాజీ, రమ్యకృష్ణల సినిమాతో పాపులర్

Tollywood Director: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రైటర్‌, దర్శకుడు బండి రఘురామ్‌ కన్నుమూశారు. ఆయన హార్ట్ ఎటాక్‌తో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 29 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
దర్శకుడు రఘురామ్‌ కన్నుమూత
Image Credit : Asianet News

దర్శకుడు రఘురామ్‌ కన్నుమూత

టాలీవుడ్‌ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రఘురామ్‌ కన్నుమూశారు. `వరం` చిత్రంతో పాపులర్‌ అయిన బండి రఘురామ్‌ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రఘురామ్‌ దర్శకుడు మాత్రమే కాదు, రైటర్‌, జర్నలిస్ట్ కూడా. ఆయన ఈటీవీ, వీ6, ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ వంటి మీడియా సంస్థల్లో స్పెషల్‌ కరస్పాండెంట్‌గా వర్క్ చేశారు.

బండి రఘు రామ్‌ హైలీ ఎడ్యూకేటెడ్‌. ఆయన జర్నలిజంలో ఎంఫిల్‌ చేశారు. అలాగే ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పీహెచ్‌ డీ పూర్తి చేశారు. లిబ్యాన్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫేసర్‌గా పనిచేశారు. సినిమాలపై ఆసక్తితో అవన్నీ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు. ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు సానాయాదిరెడ్డి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆయన రూపొందించిన అన్ని సినిమాలకు రఘురామ్‌ పనిచేశారు. దర్శకత్వంలో మంచి అనుభవాన్ని పొందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
`వరం` సినిమాకి దర్శకత్వం
Image Credit : sun nxt

`వరం` సినిమాకి దర్శకత్వం

2004లో ఆయన దర్శకుడిగా మారి `వరం` అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శివాజీ, రమ్యకృష్ణ  వంటి వారు నటించారు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ దర్శకుడిగా నిరూపించుకునేందుకు స్ట్రగుల్‌ అవుతున్నారు. చాలా సినిమాలకు రైటర్‌గా, గోస్ట్ రైటర్‌గా పనిచేశారు. ఇప్పటికీ దర్శకత్వ ప్రయత్నాల్లోనే ఉన్నారు. కానీ ఇంతలోనే ఇలా కావడం అత్యంత బాధాకరం.

 రఘురామ్‌ కి జర్నలిస్ట్ గా తెలుగు మీడియాలో మంచి పేరుంది. ఆయన ఇచ్చే సినిమా రివ్యూలకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. రఘురామ్‌ స్వస్థలం జగిత్యాల. ప్రస్తుతం హైదరాబాద్‌లో యూసఫ్‌ గూడలోని మధురానగర్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రఘు రామ్‌ మరణంతో చిత్ర పరిశ్రమలోనే కాదు. మీడియాలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Related Stories
Recommended image1
Kara Movie First Review: ధనుష్‌ `కర` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.. హైలైట్స్ ఇవే, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Toxic Movie: 'టాక్సిక్' మళ్ళీ వాయిదా, కారణం ఇదే.. మరోసారి సస్పెన్స్ లో పెట్టిన యశ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved