- Home
- Entertainment
- స్లీవ్‌లెస్ గౌన్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా.. ఆర్టిఫిషియల్ అందమంటూ కామెంట్
స్లీవ్‌లెస్ గౌన్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా.. ఆర్టిఫిషియల్ అందమంటూ కామెంట్
నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా సినిమాల కంటే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తన హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి చుక్కలు చూపిస్తుంది. ఘాటైన అందాలతో కనువిందు చేస్తుంది.

పూనమ్ బజ్వా(Poonam Bajwa) తెలుగులో కనిపించి చాలా రోజులవుతుంది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికి టచ్‌లోనే ఉంది. ఈ అమ్మడి ఘాటైన అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో కనిపించకపోయినా ఫర్వాలేదు, ఇలా మాత్రం హాట్ అందాల విందు చాలు అనేలా గ్యాప్ లేకుండా రెచ్చిపోతుందీ హాట్ హీరోయిన్.
లేటెస్ట్ గా ఆమె స్లీవ్ లెస్ గౌన్‌లో వయ్యారాలు ఒలకబోసింది. సైడ్ లుక్‌లో టెంప్ట్ చేస్తూ విరహాలతో కూడిన పోజులిస్తూ కనువిందు చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతుంది. ఇందులో ఆమె `అనుభూతి చెందడానికి` అంటూ పోస్ట్ పెట్టింది. తన ఫోటోని చూసి అనుభూతి పొందాలని చెబుతుంది పూనమ్.
ఇక నాగార్జునతో కలిసి నటించిన `బాస్` చిత్రంతో తెలుగులో పాపులర్ అయ్యింది పూనమ్ బజ్వా. అందులో యమ హాట్‌గా కనిపించి ఆడియెన్స్ ని టెంప్ట్ చేసింది. ఉన్న కాసేపే అయినా ఉక్కిరిబిక్కిరి చేసింది. నాగార్జున పీసీ హాట్ లుక్‌లో కనిపించి ఆయన్నే పడేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు ఈ అమ్మడి అందాన్ని, ఓవరాక్షన్‌ని చూసి నయనతారకే జెలసీ పుట్టించిందంటే పూనమ్ స్ఠామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
`బాస్` చిత్రంతోనే తన మార్క్ ఏంటో చాటుకుంది. అంతకు ముందు `మొదటి సినిమా`తోనే తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసింది. ఇందులో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఆ తర్వాత `ప్రేమంటే ఇంతే` చిత్రంలోనూ మెరిసింది. ఈ సినిమాకి అంతగా గుర్తింపు దక్కలేదు. అనంతరం వచ్చిన `బాస్`తో పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత `వేడుక` సినిమా చేయగా, అది పరాజయం చెందింది. మరోవైపు బన్నీ హీరోగా నటించిన `పరుగు`లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరిసింది. హీరోయిన్ అక్కగా, ప్రియుడితో లేచిపోయిన అమ్మాయిగా నటించి మెప్పించింది. కాసేపే అయినా తన మార్క్ ని చాటుకుంది. అయితే ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. దీంతో తెలుగులో సినిమాల తగ్గించింది పూనమ్. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి.
తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడ మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం విశేషం. చాలా గ్యాప్‌తో `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో మెరిసింది. ఇప్పుడు చూడబోతుంటే ఆమె మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇప్పుడు అన్ని భాషల్లోనూ పూనమ్‌కి ఆఫర్స్ తగ్గిపోయాయి. కాస్త బొద్దుగానూ మారిపోయింది. హాట్‌నెస్ మాత్రం ఓవర్‌లోడ్ అనేలా అయ్యింది. కేవలం మలయాళంలో రెండు సినిమాలు చేస్తుంది పూనమ్ బజ్వా.
సినిమాలకు అతీతంగా గ్లామర్ వైపు ఫోకస్ పెట్టింది. పొట్టిదుస్తుల్లో ఫోటోలకు పోజులిస్తూ నెటిజన్లని కనువిందు చేస్తూ, సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, అందాల ట్రీట్‌కి తెరలేపుతుంది పూనమ్. లేటెస్ట్ ఫోటో సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం.