MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూజాహెగ్డే ఇల్లు చూస్తే షాకవ్వాల్సిందే...జిగేలు రాణి లెవెలే వేరు..!

పూజాహెగ్డే ఇల్లు చూస్తే షాకవ్వాల్సిందే...జిగేలు రాణి లెవెలే వేరు..!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) తాజాగా హోమ్ టూర్ చేసింది. స్టైలిష్ అండ్ అట్రాక్టివ్ ఇంటీరియర్ ను కలిగి ఉండటంతో ఓ మ్యూజియంను తలపిస్తోంది. ఎంట్రెన్స్ మొదలు ప్రతిచోట ఏదోక డిజైన్ సెట్ చేయడం ఆకర్షణీయంగా ఉంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 18 2022, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా ముంబైలోని తన ఇంటిని ఎలా డిజైన్ చేసుకుందో చూపించింది. ప్రతి గదిని స్టైలిష్ గా, అలాగే అట్రాక్టివ్ ఇంటీరియర్ తో నింపేసింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదలు ప్రతిదీ తన అభిరుచిగా తగట్టుగానే సెట్ చేయించుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇప్పటికే మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హోమ్ టూర్ ద్వారా తన ఇంట్లోని ప్రత్యేకతలను తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బుట్టబొమ్మ ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఈజ్ సీరీస్’ వీడియోలలో భాగంగా హోమ్ టూర్ చేసింది. తన ఇంటిలోని ఒక్కో స్పెషాలిటీని తెలియజేసింది. 
 

37

ముందుగా పూజా ఇంటి ఎంట్రెన్స్ నుంచి వివరించడం మొదలుపెట్టింది. గ్రీన్ కలర్ లోని పెద్ద తలుపులను ఓపెన్ చేసి స్వాగతం పలికింది. డోర్ పై గోల్డ్ లెటర్స్ లో పూజా హెగ్దే అనే పేరును సెట్ చేయడం ఆకర్షణీయంగా ఉంది. ఇంట్లోనికి ఎంట్రీ కాగానే ఆరు టెబుల్స్ ఉన్న ఓ డైనింగ్ టేబుల్ ను చూడొచ్చు. ఆ గదికి అవతలి వైపున పాలరాతితో కూడిన ఓపెన్ కిచెన్ ఉంటుంది. 
 

47

కిచెన్ లోని ఇంటీరియర్స్, లైటింగ్స్, టైల్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. అలాగే వంటగదికి రెండు స్లైడింగ్ డోర్స్ ఉండటం ప్రత్యేకంగా అనిపిస్తుంది. పొగ, ఘాటు రాకుండా ఇవి ఊపయోగపడుతాయి. ఓపెన్ కిచెన్ గానూ కనిపిస్తుంది. కిచెన్ లో తన నచ్చిన బ్లూ కలర్ ను పెయింట్ చేయించినట్టు తెలిసింది. ముఖ్యంగా వైట్ బ్యాక్‌ స్ప్లాష్‌, హ్యాంగింగ్ లైట్స్ ఇష్టమని, నైట్ టైమ్ లో ఆ లైట్స్ వెలుతురు కనువిందుగా ఉంటాయంది.

57

ఇక తన లివింగ్ రూమ్ నూ అట్రాక్టివ్ పెయింటింగ్, స్టైలిష్ మెటీరియల్, ఫంక్షనల్ డిజైనింగ్ తో ఆకర్షణీయంగా సెట్ చేయించింది. ఇక అక్కడి సోఫాలకు ఉన్న పింక్ కవర్స్ ఆకట్టుకుంటున్నాయి. పూజా హెగ్దేకు పింక్, వైట్ కలర్ ఇష్టం కావడంతో గదిలో చాలా వరకు ఆ రంగులోనే డిజైన్స్ ఉంటాయని తెలిపింది.
 

67

పూజా హెగ్దేకు తన ఇంటిలో చాలా ఇష్టమైన ప్లేస్ తన బెడ్  రూమ్. అందులోనూ ఓ కారిడార్ అంటే మరీ ఇష్టమని చెప్పింది. అక్కడే తను స్ఫూర్తి పొందిన సినిమాల పోస్టర్లను రెండువైపులా గోడలకు మొత్తం ఏర్పాటు చేసింది. వాటిని చూసినప్పుడల్లా తనకు ఎనర్జి వస్తుందని చెప్పింది. ఆ ప్లేస్ తనకు ఫెవరేట్ అని వివరించింది. 
బెడ్‌రూమ్ నూ ఆహాల్లాదకరమైన ప్రదేశంగా మార్చుకుంది. 
 

77

ఖరీదైన బెడ్, స్పెషల్ ఇంటీరియర్స్ తో పాటు ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా ఉండటం విశేషం. తన బెడ్ రూమ్ లోనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ సమయం గడుపుతారని చెప్పింది. విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో తనకు నచ్చిన డిజైన్లను కూడా ఇంటిలో సెట్ చేయించినట్టు తెలిపింది. కాలుకు గాయం కావడంతో ఇటీవలె కోలుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘సర్కాస్’,‘కిసీ కా భాయ్ కిసి కా జాన్’, తెలుగులో మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved