10 ఏళ్ళ తర్వాత నాగ చైతన్యతో స్టార్ హీరోయిన్ రొమాన్స్.. విచిత్రం ఏంటో తెలుసా
అక్కినేని నాగ చైతన్య సినిమాల లైనప్ ప్రస్తుతం క్రేజీగా ఉంది. నాగ చైతన్య ప్రస్తుతం చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Akkineni Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య సినిమాల లైనప్ ప్రస్తుతం క్రేజీగా ఉంది. నాగ చైతన్య ప్రస్తుతం చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన చందు ముండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి నుంచి ఈ చిత్రంపై హైప్ పెంచుతున్నారు. చైతు ఈ చిత్రంలో బోట్ నడిపే మత్స్యకారుడిగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం కోసం చైతు సరికొత్తగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. డైలాగులు కూడా శ్రీకాకుళం యాసలో ఉండబోతున్నాయి. చైతు కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాగ చైతన్య మరో క్రేజీ చిత్రాన్ని లాక్ చేశారు.
విరూపాక్ష చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి చిత్రం లాక్ అయినట్లు తెలుస్తోంది. విరూపాక్ష చిత్రాన్ని వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలతో కార్తీక్ తెరకెక్కించారు. నాగ చైతన్య కోసం కూడా కార్తీక్ మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో అదిరిపోయే కథ రెడీ చేసినట్లు టాక్.
ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. కార్తీక్..ఈ మూవీలో నాగ చైతన్యకి జోడిగా స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. నాగ చైతన్య, పూజా హెగ్డే ఆల్రెడీ కలసి నటించారు.
పూజా హెగ్డే తన కెరీర్ బిగినింగ్ లో చైతుతో ఒక లైలా కోసం అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు పదేళ్ల పదేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ మరోసారి నటించబోతున్నారు.
అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే..పూజా హెగ్డే ఒకలైలా కోసం చిత్రంలో నటించే సమయంలో ఆమె స్టార్ హీరోయిన్ కాదు. పదేళ్ల తర్వాత ఇప్పుడు నటించబోతున్న సమయంలో ఆమె స్టార్ హీరోయినే.. కానీ వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. చేతిలో ఒక్క క్రేజీ ప్రాజెక్టు కూడా లేదు. అయితే నాగచైతన్య, పూజా హెగ్డే జోడి పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.