Pooja Hegde Special Song: బాలీవుడ్ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్...? రొమాంటిక్ హీరోతో కలిసి...
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే వెంటనే పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. ఆల్ మోస్ట్ టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరిని కవర్ చేసిన పూజా బాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది.
Pooja Hegde
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేసులో పూజ హెగ్డే ముందు వరుసలో ఉంది. పూజ హెగ్డే ఉందంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఇక్కడ బలపడిపోయింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ ఆమె అడిగినంత కట్టబెట్టడానికి వెనకాడటం లేదు. టాలీవుడ్ నుంచి ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ లో నటించింద పూజా.. ఈమూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.
టాలీవుడ్ లో స్టార్ డమ్ వచ్చింది ఇక బాలీవుడ్ ను ఓ చూపు చూడాలి అని ఫిక్స్ అయ్యింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. అందుకే ఫోకస్ అంతా బాలీవుడ్ సినిమాల మీద పెట్టింది. అక్కడే కొన్ని సినిమాలు కూడా చేస్తోంది. మంచి మంచి ఆఫర్లకోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది.
రాధేశ్యామ్ సినిమా తరువాత టాలీవుడ్ లో ఆమె త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనుంది. రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న ఈ సినిమా..త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో చేసుకుంటూనే.. బాలీవుడ్ లో ఏ చిన్న అవకాశం వదులుకోవడం లేదు పూజా హెగ్డే.
బాలీవుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..రణ్ బీర్ కపూర్ హీరోగా.. బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న మూవీ యానిమల్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ కుజంటగా పరిణీతి చోప్రా నటిస్తుండగా.. ఓ ఇంపార్టెంట్ సాంగ్ కోసం ఫేమస్ హీరోయిన్ ను తీసుకోవాలి అని అనుకున్నారట. ఇందకోసం వారు తీసుకున్న పేరు పూజా హెగ్డే. బాలీవుడ్ లో ఎలాగైనా పాతుకుపోవాలి అనుకుంటున్న పూజా..ఈ సాంగ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక మనిషి జంతువులా ప్రవర్తిస్తే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి..? ఈ ఊహే విచిత్రంగా ఉంటే.. ఆ ఊహను సినిమాగా చూస్తే ఎలా ఉంటుంది. ఈ నేపథ్యంలో కథ నడుస్తుందట. అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో మాస్ ఐటమ్ నెంబర్ ను పూజ చేస్తే బాగుటుందని భావించి ఆమెను సంప్రదించారట.
అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో అదరగొట్టబోతుంది పూజా హెగ్డే. ఇప్పటికే బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని.. అక్కడే కొత్తగా ఇల్లు కూడా కొనుకుంది. రీసెంట్ గా గృహప్రవేశం కూడా చేసింద పూజా. సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోస్ తో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంది.