MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సూపర్ హిట్ సీక్వెల్ లో పూజా హెగ్డే , లక్కీ ఛాన్స్ కొట్టినట్లే

సూపర్ హిట్ సీక్వెల్ లో పూజా హెగ్డే , లక్కీ ఛాన్స్ కొట్టినట్లే

ఫెయిల్యూర్స్ తర్వాత కూడా పూజకు కంటిన్యూగా ఆపకుండా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.  తెలుగు నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలనే ఉత్సాహంతోనే ఉన్నారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Sep 12 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఆ మధ్యన వరస సినిమాలతో  ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేన స్టార్ హీరోయిన్  పూజా హెగ్డే  హఠాత్తుగా ఆఫర్స్ తగ్గిపోయి మాయమైపోయింది.  గత కొద్ది కాలంగా ఆమె ఏ సినిమాలోనూ కనిపించటం లేదు. దాంతో   ఏదన్నా అనారోగ్యమా ఇవన్ని కాక ఆమెకు ఆఫర్స్ రావటం లేదా అనే డౌట్స్ అందరిలోనూ మొదలయ్యాయి.  

అయితే ఆమె తాజాగా ఓ కొత్త చిత్రం కమిటైందని తమిళ సినిమా వర్గాల సమాచారం. ఆ చిత్రం కూడా ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావటంతో మంచి ఆఫర్ వచ్చిందని ఆమె అబిమానులు సంతోష పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
actress pooja hegde

actress pooja hegde


2012లో  తమిళ చిత్రం మూగమూడి  తో పూజా హెగ్డే హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత తెలుగులోకి నాగచైతన్య సినిమా  ఒక లైలా కోసం  తో అడుగుపెట్టింది.

ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. నెక్స్ట్ ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ తో జతకట్టింది. పూజా హెగ్డే మొదటి మూడు సినిమాలు సౌత్ లో పెద్దగా సక్సెస్ కాలేదు. 

36
pooja hegde

pooja hegde


దాంతో హిందీకి వెళ్లి హృతిక్ రోషన్ సరసన మోహింజదారో సినిమా చేసింది.  ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.  మళ్లీ తెలుగుకు వచ్చి అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ చేసి పూజా మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది.

అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా జెట్ స్పీడ్ తో పూజా హెగ్డే కెరియర్ కొనసాగింది. అయితే ఆ తర్వాతే వరస ఫెయిల్యూర్స్ పలరించటం మొదలయ్యాయి.

46

2022లో పూజా హెగ్డే నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు సినిమాలలో మూడు డిజాస్టర్ అయ్యాయి. బీస్ట్ మూవీ మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2023లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించిన కిసీకా భాయ్ కిసీకి జాన్ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

అదే సమయంలో మహేష్ బాబు  గుంటూరు కారంతో పాటుపవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో ఛాన్స్ లని పోగొట్టుకుంది. అప్పట్లో మహేష్ కోరిక మేరకు  గుంటూరు కారం నుంచి పూజను వద్దని శ్రీలీలను రీప్లేస్ చేసారు అని అంటారు. అయితే పూజతో అందరికి వచ్చిన సమస్య ఏమిటి, ఆమెను తమ సినిమాల్లో మూకుమ్మిడిగా ఎందుకు వద్దనుకున్నారు.
 

56


  పూజ ఒప్పుకున్న కొత్త చిత్రం విషయానికి వస్తే...

కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంతో వచ్చిన కాంచన సిరీస్ సినీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన ముని, కాంచన 2, గంగా(కాంచన 3) చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా 'కాంచన 4'ను లారెన్స్ ప్రకటించారు.

అ మూవీకి సంబంధించి కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఈ  సినిమా కూడా అలరిస్తుందని ఆ మధ్య ఓ ఇంటర్వూలో తేలిపాడు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్ డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమాలో హీరోయిన్ ముంబై భామ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ. 100 కోట్లు బడ్జెట్ తో బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు.  
 

66


తెలుగు విషయానికి  వస్తే..

ఇక  పూజ చేతిలో సాయి తేజ్ సరసన కమిటైన చిత్రం మిగిలింది. రీసెంట్ గా ఆ ప్రాజెక్టు కూడా ఓటిటి సమస్యలతో కాన్సిల్ అయ్యింది. దాంతో ఇప్పుడు  పూజ కెరీర్ డైలమోలో పడింది. తెలుగులో రీలాంచ్ అవ్వాలనుకుంటోంది. అలాగని మీడియం హీరోల సరసన ఆమె చెయ్యాలనుకోవటం లేదు. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే తన రెమ్యునరేషన్ తగ్గిస్తానిని, స్టార్ ఖర్చు కూడా తనే భరిస్తానని కబుర్లు పంపుతోందిట.ప్రస్తుతం పూజ ..హిందీలో షాహిద్ కపూర్ సరసన, తమిళంలో సూర్య సరసన మరో సినిమా చేస్తోంది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved