MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ట్రెండీ వేర్‌లో ప్రపంచ వేదికపై పూజా హెగ్డే హోయలు.. బ్రాండ్‌ ఇండియాకి ప్రతినిధిగా వచ్చానంటూ వ్యాఖ్యలు..

ట్రెండీ వేర్‌లో ప్రపంచ వేదికపై పూజా హెగ్డే హోయలు.. బ్రాండ్‌ ఇండియాకి ప్రతినిధిగా వచ్చానంటూ వ్యాఖ్యలు..

పూజా హెగ్డే టాలీవుడ్‌ని ఊపేయడమే కాదు, ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. తాజాగా ఆమె కాన్‌(Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ట్రెండీ వేర్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 18 2022, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్‌ కాన్‌(Cannes Film Festival 2022) ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. 2022కి గానూ జరిగే 75వ కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాలీవుడ్‌ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నాలు పాల్గొన్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనె, ఐశ్వర్యరాయ్‌, హినా ఖాన్‌లు సందడి చేస్తున్నారు. అయితే వీరిలో పూజా ప్రత్యేకంగా నిలవడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇందులో పూజా హెగ్డే ట్రెండీ డిజైనింగ్‌ గౌన్‌లో మెరిసింది. జబ్బలపై నుంచి గౌన్‌ జారిపోతున్నట్టుగా ఉన్న ఈ సరికొత్త ఫ్యాషన్‌ దుస్తుల్లో కనువిందు చేసింది పూజా. కాన్‌ తీరన ఉన్న నది వద్ద ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోగా, ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

37

ఫస్ట్‌ టైమ్‌ కాన్‌(Cannes) చిత్రోత్స వేడుకలో పూజా పాల్గొనడం విశేషం. దీంతో ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ సారి కాన్‌లో ఇండియా సినిమాకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఏర్పాటు చేసిన `ఇండియా పెవిలియన్‌` ఓపెనింగ్‌లో దీపికా, తమన్నా, హినా ఖాన్‌లతో కలిసి పాల్గొంది పూజా హెగ్డే. ఇందులో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

47

కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని రెడ్‌ కార్పెట్‌పై వాక్‌చేయడం తన డ్రీమ్‌ అని తెలిపింది పూజా హెగ్డే. ఇప్పుడు ఆ డ్రీమ్‌ తీరబోతుందని తెలిపింది. అయితే తాను ఏదో ఒక బ్రాండ్‌ నుంచి రిప్రజెంట్‌ చేయడానికి రాలేదని, బ్రాండ్‌ ఇండియా తరఫున ప్రతినిధిగా వచ్చానని పూజా చెప్పడం అందరిని ఆకట్టుకుంది. దీంతో అంతా ఆమెని ప్రశంసల్లో ముంచెత్తారు.
 

57

తాను ఒక ఇండియన్‌ యాక్టర్‌గా ఇక్కడికి వచ్చానని, ఇండియన్‌ సినిమాని ఇక్కడ సెలబ్రేట్‌ చేయడానికి వచ్చానని పూజా చెప్పిన వ్యాఖ్యలకు అంతా ఫిదా అవుతున్నారు. అందులోనే ఉన్నా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మాధవన్‌, రెహ్మాన్‌, శేఖర్‌ కపూర్‌, రిక్కీ కేజ్‌, ప్రసూన్‌ జోషీ, వాణీ త్రిపాఠి ఫిదా అయ్యారు. ప్రస్తుతం పూజా చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

67

ఇక ఇప్పటి వరకు ఇండియన్‌ పెవిలియన్‌ లాబీకే పరిమితమైన పూజా హెగ్డే నెక్ట్స్ రెడ్‌ కార్పెట్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే దీపికా జ్యూరీ సభ్యురాలిగా రెడ్‌ కార్పెట్‌లో హోయలు పోగా, తమన్నా, పూజా హెగ్డేలో రెడ్‌ కార్పెట్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. 
 

77

పూజా హెగ్డే ఇటీవల `రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రాలు పరాజయం చెందినా పూజా అందాలు మాత్రం ఆడియెన్స్ ని కనువిందు చేశాయి. ప్రస్తుతం ఆమె మహేష్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో నటించబోతుంది. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలు, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ మూవీ `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image3
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved