Pooja Hegde : హాఫ్ శారీలో పూజా హెగ్దే.. బుట్టబొమ్మ ఎంత ముద్దుగా ఉందో చూశారా! ఫొటోలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే Pooja Hegde ప్రస్తుతం సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక్కడి టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన అందంతో, నటనతో ఆకట్టుకుంది.
అయితే, బుట్టబొమ్మకు కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో కాలం కలిసి రావడం లేదు. ఎలాంటి సినిమా చేసినా.. ఎంతటి హీరోతో చేసినా ఆ మూవీ ఫలితం బెడిసికొడుతోంది. దీంతో ఆఫర్లు కూడా క్రమంగా తగ్గాయి.
మరోవైపు పూజా హెగ్దే కూడా కొద్దిరోజులు సినిమాల విషయంలో గ్యాప్ తీసుకుంది. చివరిగా హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ’కిసి కా బాయ్ కిసి కి జాన్’తో అలరించింది. ప్రస్తుతం ‘దేవ’ అనే చిత్రంలో నటిస్తోంది.
సినిమాల విషయంలో పూజా హెగ్దే ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది.
తాజాగా రెట్రో లుక్ లో మెరిసింది. గ్రీన్, లైక్ పింక్ హాఫ్ శారీలో ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిచ్చింది. కొప్పునిండా పూలు పెట్టి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకు స్టన్నింగ్ గా ఫొజులిచ్చింది.
సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరిసిన పూజా తన అభిమానులనే కాదు నెటిజన్ల హృదయాలనూ కొల్లగొడుతోంది. దీంతో వారు లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట మరింతగా వైరల్ చేస్తున్నారు. బుట్టబొమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.