పూజా హెగ్దే ఫ్యూచర్ ప్లానింగ్స్.. అలాంటి పాత్రల్లో నటించాలని ఉందంటున్న పూజా హెగ్దే
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం కిసీకా బాయ్ కిసికి జాన్ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా తను చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి.
స్టార్ హీరో పూజా హెగ్డే వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ తో పాటు నార్త్ లోను ఈ అమ్మడు క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం పూజ నటించిన హిందీ చిత్రం 'kisi ka bhai kisi ki jaan' చిత్ర ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు. సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలోనే తన గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో పూజ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్లో తన టార్గెట్ గురించి చెప్పుకొచ్చారు.
పూజా హెగ్డే మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ చేయాలంటే చాలా భయం. అందుకే మా అమ్మ నన్ను భరతనాట్యం నేర్చుకోమని చెబుతూ ఉండేది. ఆ తర్వాత నుంచి డాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. ఇక సినిమాల్లో విషయానికొస్తే చాలా టార్గెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నాకు మహిళలను చైతన్యవంతం చేసే పాత్రల్లో నటించాలని ఉంది.
ప్రతి భాషలోనూ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా సినిమా చేయడాన్ని గౌరవంగా భావిస్తాను.' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటికే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్లను కూడా కొట్టి పారేసింది. రూమర్లను పెద్దగా పట్టించుకోనని కూడా చెప్పింది. ఏదేమైనా బుట్ట బొమ్మ ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ ఆకట్టుకుంటుంది.
తెలుగు, తమిళం మరియు హిందీలో చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మరింత ఎత్తుకు ఎదుగుతుంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్న బుట్ట బొమ్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన 'కిసికా భాయ్ కిసికి జాన్'లో నటిస్తున్న విషయం తెలిసింది. ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
సల్మాన్ -పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. వెంకటేష్, జగపతిబాబు, భూమిక చావ్లా కీలకపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కూడా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందు రానంది చిత్రం. పూజ అయితే మహేష్ బాబు సరసన SSMB28లో నటిస్తోంది.