సీనియర్ స్టార్ హీరో వలలో పూజా హెగ్డే, అతడితో లవ్ ఎఫైర్ ?.. దుమారం రేపుతున్న ఫిలిం క్రిటిక్ ట్వీట్
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.
బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. సౌత్ లో పూజా హెగ్డే తిరుగులేని గ్లామర్ క్వీన్. అందులో సందేహం లేదు.
Pooja Hegde
అయితే పూజా హెగ్డే మనసు బాలీవుడ్ పై కూడా ఉంది. కెరీర్ ఆరంభం నుంచి పూజా హెగ్డే బాలీవుడ్ లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడ కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది కానీ విజయాలు ఆమడ దూరంలో ఉన్నాయి. బాలీవుడ్ లో పూజా హెగ్డే నెక్స్ట్ లెవల్ కి చేరుకోలేకపోతోంది. కెరీర్ బిగినింగ్ లో కొంతకాలం సౌత్ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి మరీ బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసింది. కానీ పూజా హెగ్డే ప్రయత్నాలేవీ కలసి రాలేదు.
టాలీవుడ్ లో మాత్రం డీజే చిత్రంతో ఆమె దశతిరిగింది. కుర్ర ప్రేక్షకుల కోసం పసందైన గ్లామర్ ఎలా వడ్డించాలో నేర్చుకుంది. ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉన్నప్పటికీ హిందీ చిత్రాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ గా భాయ్ కిసీ గా జాన్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కామియో రోల్ లో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా పూజా హెగ్డే పర్సనల్ లైఫ్ గురించి సంచలన రూమర్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వివాదాస్పద ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు మూవీ రివ్యూలు ఇస్తూ కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉమైర్ సంధు చేసే వ్యాఖ్యలు వివాదంగా మారుతుండడం చూస్తూనే ఉన్నాం.
ఉమైర్ సంధు తాజాగా పూజా హెగ్డే గురించి గురించి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పూజా హెగ్డే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగుతున్నట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. బిటౌన్ లో కొత్త ప్రేమ మొదలైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో 'కిసీకా భాయ్ కిసీకి జాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు.
పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ లో మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేసింది అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఉమైర్ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చేసే కామెంట్స్ అన్ని ఫేక్ అని కొట్టి పారేస్తుంటే.. మరికొందరు మాత్రం అందులో నిజం లేకపోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో రాణించేందుకు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ అండదండలు కోరుకుంటోంది. అందుకే అతడితో క్లోజ్ గా ఉంటోంది అని అంటున్నారు.
ఇటీవల పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. 'కిసీకా భాయ్ కిసీకి జాన్' సెట్స్ లోనే పూజా హెగ్డే బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కి ప్రేమ వ్యవహారాలు కొత్తేమీ కాదు. కానీ పూజా హెగ్డే ఈ సీనియర్ హీరోతో నిజంగా రిలేషన్ లో ఉందా అనేది ప్రశ్న.