- Home
- Entertainment
- స్టార్ హీరోతో సినిమా.. పూజా హెగ్డే టైమ్ మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?.. బుట్టబొమ్మ 2.0 చూపిస్తుందా?
స్టార్ హీరోతో సినిమా.. పూజా హెగ్డే టైమ్ మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?.. బుట్టబొమ్మ 2.0 చూపిస్తుందా?
పూజా హెగ్డే నెమ్మదిగా పుంజుకుంటుంది. ఒక్కో ఆఫర్‌ని దక్కించుకుంటూ బిజీ అవుతుంది. తాజాగా స్టార్ హీరో సినిమాలో ఎంపికై తనలోని 2.0 చూపించేందుకు రెడీ అవుతుంది.

పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో స్ట్రగులింగ్‌గానే సాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. స్టార్ హీరోయిన్ కావడమే కాదు, నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది. అంతే ఆ పీక్ లో ఉన్న సమయంలోనే వరుస పరాజయాలు బుట్టబొమ్మని అమాంతం కిందకి పడేశాయి. టాలీవుడ్ ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా జీరో అయిపోయింది. ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి నెలకొంది.
ఉన్న సినిమాలు పోయాయి. `గుంటూరు కారం`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలను నుంచి తొలగించారు. `గంజాశంకర్` ఆగిపోయింది. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇక పూజా పని అయిపోయిందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికీ తెలుగులో కొత్తగా మరే సినిమాని కన్ఫమ్ చేయలేదు పూజా. కానీ కెరీర్ పరంగా రీస్టార్ట్ అవుతుంది. ఓ భారీ ఆఫర్ ని అందుకుంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
తాజాగా సూర్యతో జోడీ కడుతుంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 పేరుతో ఓ మూవీ రూపొందబోతుంది. తాజాగా ఈ మూవీ కాస్టింగ్‌ని ప్రకటించింది యూనిట్. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నేమ్‌ని ప్రకటించడం విశేషం. దాదాపు రెండేళ్ల తర్వాత పూజాకి ఓ భారీ ఆఫర్ దక్కిందని చెప్పొచ్చు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కుతుంది. డౌన్‌లో ఉన్న సమయంలో పూజాకిది పెద్ద ఆఫర్ అనే చెప్పాలి.
ఇదే కాదు ప్రస్తుతం చర్చల్లో మరికొన్ని సినిమాలున్నాయట. ఇప్పటికే హిందీలో `దేవా` చిత్రంలో షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తుంది. అలాగే అహన్ శెట్టితో కలిసి సాజిద్ నడియడ్ వాలా మూవీలో ఎంపికైంది. `శక్తి వాలెంటైన్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ రెండు మూవీస్‌తో బాలీవుడ్‌లో బిజీ అవుతుంది బుట్టబొమ్మ. సూర్య చిత్రంతో కోలీవుడ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.
ఇక ఇప్పుడు తెలుగులోనూ ఈ అమ్మడికి ఆఫర్లు లేవు. అయితే ఆ మధ్య నానితో సినిమా చేయబోతుందన్నారు. సుజీత్, నాని కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో పూజానే హీరోయిన్ అనే వార్త వినిపించింది. కాన ఈ మూవీనే ఆగిపోయిందని సమాచారం. మరోవైపు `టిల్లు క్యూబ్`లోనూ పూజా పేరు వినిపించింది. మరి ఇందులో ఏది వర్కౌట్ అవుతుందనేది చూడాలి. సూర్య చిత్రంతో పూజా కెరీర్‌లో బౌన్స్ బ్యాక్ అవుతుందా? తనలోని 2.0 చూపిస్తుందా అనేది చూడాలి.