బిజీగా ఉన్నా.. ఆయన అడిగారని సినిమా చేశా..పూజా హెగ్డే క్రేజీ కామెంట్స్..
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే క్రేజీ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా సర్కస్ సినిమాలో మెరిసిన బ్యూటీ.. ఈసినిమా చేయడానికి కారణం ఏంటో వివరించింది.

సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీ అవుతుంది పూజా హెగ్డే. వరుస సినిమాలు ప్లాప్ అవుతున్నా.. వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. రీసెంట్ గా ఆమె రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన సర్కస్ సినిమా రిలీజ్ అయ్యింది. కాని ఈ మూవీ పెద్దగా ప్రభావి చూపించలేకపోయిందిఈ క్రమంలో పూజా హెగ్డే ఓ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సర్కస్ సినిమా చేయడానికి ఒకటే ఒక కారణం ఉంది అంటోంది పూజా. అది ఈ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలి అనేది తన చిరకాల కోరిక. అది ఇంత త్వరగా నెరవేరుతుంది అనుకోలేదు. అంటోంది పూజా. ఆయన కోసమే తాను ఎంత బిజీగా ఉన్నా.. ఈ సినిమాను చేశానంటోంది పూజా.
అంతే కాదు ఆయన ఒక్క కాల్ చేయడంతో.. అసలేం ఆలోచించకుండా సినిమాను ఒప్పుకున్నా అంటోంది పూజా. తాను ఇంట్లో ఉండి కూడా రోహిత్ శెట్టి కాను ను మిస్ అయ్యిందట బ్యూటీ. అప్పుడు..పూజా అమ్మగారు రిటన్ కాల్ చేయమని చెప్పడం..రోహిత్ శెట్టి కాల్ లిప్ట్ చేసి విషయం చెప్పడంతో.. ఎగిరి గంతులేశానంటోంది.
ఫోన్ మాట్లాడటం కూడా చాలా ఎక్జాయిట్ మెంట్ తో గట్టిగా మాట్లాడానంటోంది పూజా. తను ఆ టైమ్ లో బిజీగా ఉన్నా.. రోహిత్ శెట్టి సినిమా కాట్టి డేట్లు అజెస్ట్ చేసుకుని మరీ సినిమా చేశానంటోంది. ఇదే విషయాన్ని రోహిత్ అడుగుతూ.. డేట్స్ కావాలి దొరుకుతాయా అని అడిగారు. అప్పుడు రొరక్కపోయినా.. సర్ధుకుంటాను సార్ అన్నానటోంది పూజా.
Pooja Hegde
ఇక ఈ ఏడాది వరుస ఫెయిల్యూర్స్ తో ఐరెన్ లెగ్ అనిపించుకుంది పూజా హెగ్డే. 2023 అయినా కలిసివస్తుందన్న నమ్మకంతో ఉంది. వరుసగా రాధేశ్యామ్, బీస్ట్ , ఆచార్యతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కస్ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్త కొట్టాయి. అయినా సరే పూజా క్రేజ్ మత్రం ఏమాత్రంతగ్గలేదు.
ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తోంది పూజా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జోడీగా కిస్ కా బాయ్.. కిస్ కా జాన్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ మూవీలో చేస్తోది.