- Home
- Entertainment
- మహేష్ - త్రివిక్రమ్ మూవీకి పూజా హెగ్డే మూడు కండీషన్లు..? మేకర్స్ కు తలనొప్పికా మారిన స్టార్ హీరోయిన్ ..?
మహేష్ - త్రివిక్రమ్ మూవీకి పూజా హెగ్డే మూడు కండీషన్లు..? మేకర్స్ కు తలనొప్పికా మారిన స్టార్ హీరోయిన్ ..?
పూజా హెగ్డే డిమాండ్లు చేస్తోంది. తన డిమాండ్ పెరగడంతో..తను కూడా మేకర్స్ కు డిమాండ్ల మీద డిమాండ్లు , కండీషన్లు పెడుతోందట. ఇంతకీ పూజా ఏం కండీషన్లు పెడుతోంది.

వరుస ఆఫర్లతో పాటు.. వరుస ఫెయిల్యూర్స్ ను కూడా ఫేస్ చేస్తోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ముందుకు దూసుకుపోతుంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంది పూజ. దీంతో పూజా క్రేజ్ తో పాటు ఆమె డిమాండ్లు కూడా పెరిగినట్టు తెలుస్తోంది.
క్రేజ్ తో పూజా హెగ్డే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది.రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలతో ఫ్లాపులు అందుకున్న పూజా తన ఇమేజ్ ఏమాత్రం త్తగక పోవడంతో.. ఆమె పాన్ ఇండియా సినిమాలు అవకాశాల కోసం తెగ ఆరాటపడిపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాలను ఆమె నెగ్లెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్లకు నో చెప్పడానికి కూడా వెనకాడటం లేదు పూజా హెగ్డే. అంతే కాదు ఒక వేళ నటించాల్సి వచ్చినా.. టాలీవుడ్ లో నటించడానికి కండిషన్స్ అప్లై చేసేస్తుంది పూజ.రకరకాల కండీషన్స్ తో మేకర్స్ కు హడలెత్తిస్తుందట.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో హీరోయిన్ గా పూజాను తీసుకున్నారట మేకర్స్ . అయితే ఈ మూవీ కోసం పూజాను సంప్రదిస్తే కొన్ని కండిషన్ పెట్టినట్లు ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో నటించడానికి కేవలం 45 రోజులు మాత్రమే డేట్లు ఇస్తానందట పూజా హెగ్డే. ఇంతకు మించి ఒక్క రోజు ఎక్కువ ఇచ్చేది లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట.
ఇక రెండో కండీషన్ ఏంటీ అంటే.. ఈ సినిమాలో తన పాత్రకు గాను రెండు కోట్ల రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసిందట పూజా. వాటితో పాటు తనకు సబంధించిన అన్నీ నిర్మాతలే చూసుకోవాలట.
ఇక మూడో కండీషన్ గా తనతో పాటు తన స్టాఫ్ కూడా శాలరీ ఇవ్వాలంటూ కండిషన్స్ అప్లై చేసిందట పూజా హెగ్డే. వరస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే ఇలాంటి కండిషన్స్ పెట్టడం అవసరమా అంటూ ఫిల్మ్ సర్కిల్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పూజా ఇలానే చేస్తే.. మేకర్స్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటన్నాయి సినిమా వర్గాలు.