Ponniyin Selvan Review: పొన్నియన్ సెల్వన్ ట్విట్టర్ రివ్యూ.. మణిరత్నం డ్రీమ్ ఏమయ్యింది..?
భారీ బడ్జెట్... భారీ తారాగణం, చారిత్రాత్మక కథ, అన్నింటికి మించి గొప్ప దర్శకుడి డ్రిమ్ ప్రాజెక్ట్ పొన్ని యన్ సెల్వన్. ఆ డ్రీమ్ రిజల్ట్ తెలిసే రోజు ఈరోజు. తమిళ సినీ పరిశ్రమ పతాకం అన్నింటికన్నాఎత్తున ఎగరవేయాలన్న ఆశతో తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీ ఈరోజు ( సెప్టెంబర్ 30) ప్రపపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది.
మన ఇండియాకంటే ముందుగా యుఎస్ఏ తో పాటు న్యూజిలాండ్ లాంటి దేశాల్లో పొన్నియన్ సెల్వన్ ప్రీమిర్ షోలు పడ్డాయి. అక్కడ ఈ సినమాను చూసిన ఆడియన్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా గురించి వారేమన్నారు. మణిరత్నం ఏన్నో ఏళ్ల కష్టానికి ప్రతి ఫలం లభించిందా..? నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి..? నచ్చనివి ఏంటి చూద్దాం.
Ponnniyin Selvan
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది ఈసినిమా. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం అందించారు.
పొన్నియన్ సెల్వన్ సెల్వన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామంటున్నారు ఫారెన్ ఆడియన్స్. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ లో ఫస్ట్ మ్యూజిక్ గురించే ట్వీట్ చేశారు. ఈసినమాకు రియల్ హీరో ఏఆర్ రెహమాన్ .. ఆ సౌండ్స్.. సాంగ్స్ దుమ్ము రేపారంటూ.. రెహామాన్ ను ఆకాశం అంటేలా పొగిడేస్తున్నారు.
ప్రజలు తెలుసుకోవల్సిన చరిత్ర ను అద్భుతంగాక కళ్ళకు కట్టినట్టు తె లరకెక్కించాడంటూ ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈసినిమాలో చియాన్ విక్రమ్ పర్ఫామెన్స్ కు ఫిదా అయిపోయారు ఫారెన్ ఆడియన్స్. ఆయన పెట్టిన ఎఫర్ట్ కు సలామ్ చేస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్ మూవీ ఫస్ట్ హాఫ్ కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. అద్భుతమైన కథ, విజ్యూవల్స్ ఎఫెక్ట్స్ సూపర్.. మ్యూజిక్ అల్టిమేట్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మూవీ చాలా మంది నచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎక్కువగా విజ్యువల్ ఎపెక్ట్స్ తో పాటు.. సినిమాటోగ్రఫీకే ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే వరకు ఎక్కువ మంది విజ్యువల్స్ తో పాటు మ్యూజిక్ పై ఎక్కువగా ట్వీట్ చేస్తున్నారు. నటీనటులతో చియాన్ విక్రమ్ కు ఎక్కువ మార్కులు పడ్డట్టు తెలుస్తోంది.
మణిరత్నం కష్టానికి మంచి రిజల్ట్ వచ్చాయి అంటున్నారు ఫ్యాన్స్. సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లోనే 5 పాటలు ఉండటం ఆశ్చర్య కలిగించిందంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. మొత్తానికి చాలా మంది పాజిటీవ్ గా ట్వీట్ చేస్తున్నారు పొన్నియన్ సెల్వన్ సినిమాపై.
మరికొంత మంది ప్రాంతీయ బేధాలను ఈసినిమా విషయంలో తీసుకువస్తున్నారు. సినిమా ఎంత బాగున్నా.. తెలుగు వారు కావాలని బాడ్ రివ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారని.. కాని ఈసినిమా తమిళ జాతికి సబంధించిన దంటూ ట్విట్టర్ లో కూస్తున్నారు. అంతే కాదు విజయ్, అజిత్ సినిమాలా కాదు... ఇది తమిళ ప్రజలకు సబంధించిన సినిమా అంటూ వాగుతున్నారు.
ఇక పాజిటీవ్ రివ్యూస్ తో పాటు..నెగెటీవ్ టాక్ కూడా ఉంది ఈ మూవీపై. అంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసి.. డబ్బులు వేస్ట్ చేసుకున్నారంటూ కొంత మంది అభిప్రాయం వ్యాక్తం చేస్తున్నారు. ఎక్కువగా తమిళ అభిమానులు మాత్రంమే సినిమాపై పక్కాగా పాజిటీవ్ రివ్యూస్ ఇస్తున్నారు. అసలు సినిమా గురించి తెలియాలంటే. ఏషియన్ నెట్ లో పొన్నియన్ సెల్వన్ రివ్యూ అండ్ రేటింగ్ చూడాల్సిందే.