PS2 Review : పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ.. PS1తో పోల్చితే ఏమంటున్నారంటే.?
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగం PS2 ఈరోజు (ఏప్రిల్ 28న) విడుదలకు సిద్ధమైంది. యూఎస్ఏలో ప్రీమియర్ పడగా ట్వీటర్ ద్వారా ఆడియెన్స్ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తమిళ దర్శకుడు మణిరత్నం దర్వకత్వంలో, భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రీమియర్స్ యూఎస్ఏ, యూకేలో పడ్డాయి. కేరళ, తదితర రాష్ట్రాల్లో ఉదయమే ప్రీమియర్ పడనుంది. దీంతో సినిమా చూసిన ఆడియెన్స్ పార్ట్2పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా విశేషాలను ట్వీటర్ వేదికన పంచుకుంటున్నారు. మొదటి పార్ట్ తో పోల్చితే నచ్చిందా? లేదా?.. ఏమంటున్నారనేది తెలుసుకుందాం.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘పొన్నియన్ సెల్వన్’ గతేడాది సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి కొనసాగింపుగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ PS2 ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోబితా దూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం అందించారు.
పొన్నియిన్ సెల్వన్ 2 మొదటి భాగం కంటే చాలా బాగుందంటున్నారు. కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుపుతున్నారు. చిత్రంలోని ఆర్ట్ డిజైన్ మరియు పాటలతో పాటు డ్రామా చాలా వరకు డీసెంట్‌గా ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి అంతటా పాజిటివ్ టాక్ కనిపిస్తోంది.
ఇక పార్ట్ 1లో స్లోగా వెళ్లిన కథ రెండో భాగంలో మాత్రం కాస్తా వేగంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇంకాస్తా ట్రిమ్ చేస్తే బాగుండు అంటున్నారు. ఏదేమైనా మొదటి భాగం కంటే పార్ట్2 మాత్రం బాగుందనే చెబుతున్నారు. PS2 ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడియెన్స్ ను ఫిదా చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుందని తెలుపుతున్నారు.
మణిరత్నం దర్శకత్వం, రవివర్మ సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉందటు ఆకాశానికి ఎత్తుతున్నారు. ద్వితియార్థం కూడా బాగుందనే తెలుస్తోంది. సీజీ వర్క్, విజువల్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అంటున్నారు. పార్ట్ 1ను మించిన స్క్రీన్ ప్లే ఉంటుందని తెలుపుతున్నారు.
పొన్నియిన్ సెల్వన్ 2 ద్వితియార్థం క్లైమాక్స్ అదిరిపోతుందని తెలుపుతున్నారు. సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి చెబుతున్నారు. మరికొందరు ఆడియెన్స్ అయితే కాస్తా స్లో సీన్స్ ఉన్నప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తమ రివ్యూ ఇచ్చేస్తున్నారు.