- Home
- Entertainment
- ముఖం దాస్తూ అసలైన అందాలను ఓపెన్‌గా చూపిస్తున్న `పోకిరి` బ్యూటీ.. బికినీ జాతర ఇప్పట్లో ఆగేలా లేదుగా!
ముఖం దాస్తూ అసలైన అందాలను ఓపెన్‌గా చూపిస్తున్న `పోకిరి` బ్యూటీ.. బికినీ జాతర ఇప్పట్లో ఆగేలా లేదుగా!
`పోకిరి` భామ ఇలియానా అందాల జాతర కంటిన్యూ అవుతుంది. తీగలాంటి నడుముతో సౌత్ సినీ ఇండస్ట్రీని మొత్తం ఓ ఊపు ఊపిన ఈ అందాల సోయగం బికినీ జాతరకి తెరలేపింది. బీచ్‌లో జలకాలాడుతూ సెల్ఫీ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌లో ఓ సునామీ సృష్టించింది. గ్లామర్ షోతో కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. తన నడుముందాలతో ఓ ఊపు ఊపింది. తీగలాంటి నడుము చూపిస్తూ ఈ హాట్ భామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ల డ్రీమ్ గర్ట్ గా మారిన ఇలియానా లేటెస్ట్ గా మరో సంచలనానికి తెరలేపింది. తన హాట్ అందాల షోని గ్యాప్ లేకుండా ప్రదర్శిస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.
ఇటీవల బీచ్‌లో బికినీ పోజులో ఫోటోలను పంచుకుని ఆకట్టుకుంది ఇలియానా. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరిన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. సెల్ఫీ పిక్స్ లో తన సెక్సీ అందాలను దగ్గరగా చూపిస్తుంది ఇలియానా. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది.
బీచ్‌లో బెడ్‌పై పడుకుని ఇలియానా పంచుకున్న సెల్ఫీ పిక్ కాకరేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మైండ్ బ్లోయింగ్‌గా ఉన్న ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెట్టింట దుమారం రేపుతున్నాయి. మాల్డీవుల్లో వెకేషన్ పిక్స్ ని షేర్ చేయగా అవి నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఇలియానా చెబుతూ, ఎండలో కాలడం, చల్లటి నిర్మలమైన నీలి సముద్రంలో మునిగిపోవడం కంటే గొప్ప అనుభూతి మరోటి లేదని చెబుతుంది. అలా తాను గొప్ప అనుభూతిని పొందుతున్నట్టు చెప్పింది ఇలియానా. తనని తాను వాటర్ బేబీగా పోల్చుకుంది. మరోవైపు తన పెట్ డాగ్‌తో ఉన్న పిక్స్ ని షేర్ చేసుకుంది ఇలియానా. కొన్ని రోజులు ఇలా కూడా ఉండాలని, ఇలాంటి రోజుల అవసరం ఉందని చెప్పింది ఇలియానా. ప్రస్తుతం ఆమె పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
గోవా బ్యూటీగా పాపులర్ అయిన ఇలియానా `దేవదాస్` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే టాలీవుడ్ చూపుని తనవైపు తిప్పుకుంది. హాట్ టాపిక్‌గా మారింది ఇలియానా. అప్పుడే పూరీ జగన్నాథ్ కంట్లో పడింది ఇలియానా. ఇక ఆమె జాతకమే మారిపోయింది.
పూరీ జగన్నాథ్.. `పోకిరి` సినిమా కోసం ఇలియానాని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇందులో మహేష్‌బాబుకి లవ్ ఇంట్రెస్ట్ గా, గ్లామర్ పాత్రలో రెచ్చిపోయింది ఇలియానా. శృతి పాత్రలో పర్‌ఫెక్ట్ యాప్ట్ గా నిలిచి కుర్రాళ్లని కనువిందు చేసింది. పాటల్లో ఇలియానా అందాలు అదరహో అనిపించాయి. దీంతో టాలీవుడ్ ఆడియెన్స్ కి కలల రాణిగా మారిపోయింది గోవా బ్యూటీ.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇలియానాకి. బ్యాక్ టూ బ్యాక్ తెలుగులో భారీ ఆఫర్ క్యూ కట్టాయి. యంగ్ హీరోలంతా ఇలియానా డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. 2006 నుంచి 2012 వరకు టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇంతలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ భామ. `బర్ఫీ` సినిమాతో హిందీలోకి నటిగా రంగ ప్రవేశం చేసింది. అక్కడ కూడా తానేంటో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది ఇలియానా. కానీ తెలుగు స్థాయి ఇమేజ్ బాలీవుడ్‌లో ఈ భామ చూడలేకపోయింది. ఆమె నటించిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించిన సినిమాలు చాలా తక్కువ. దీంతో కెరీర్ ట్రాక్ తప్పింది.
దీనికితోడు ఆమె ప్రేమలో ఉండటం, దీంతో సినిమాలపై దృష్టి సారించలేకపోవడంతో కెరీర్ గాడీ తప్పింది. దీని వల్ల ఆమెకి సినిమాలు తగ్గాయి. తెలుగులో ఛాన్స్ లు రావడమే కష్టంగా మారింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ మేకర్స్ ఇలియానాని మర్చిపోయారా? అనే పరిస్థితి నెలకొంది. కొంత గ్యాప్‌తో మళ్లీ రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఇలియానా. అందుకు అందాలను ఎరగా వేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలియానా మరో బిగ్ ఆఫర్ దక్కించుకుంది. విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రమమూర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కొత్త చిత్రంలో నటి ఇలియానా ఎంపికైంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆధునిక సంబంధాలను ప్రధానంగా సాగే ఈ చిత్రానికి శిరీషాగుహతకుర్టా దర్శకత్వం వహిస్తున్నారు.