- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషీ నిన్ను అమ్మగా తీసుకెళ్లాలి జగతి.. మహేంద్ర కోరిక తిరుతుందా?
Guppedantha Manasu: రిషీ నిన్ను అమ్మగా తీసుకెళ్లాలి జగతి.. మహేంద్ర కోరిక తిరుతుందా?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న క్రమంలో ' చూడమ్మా..ఈ ఇల్లు నీది ఇందులో అందరికీ ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది' అని పనింద్ర, జగతి (Jagthi) తో అంటాడు. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది.

తర్వాత జగతికి, ధరణి (Dharani) పసుపు బొట్టు పెడుతూ ఉండగా ఈ లోపు రిషి ఇలాంటివి పెద్దమ్మ పెడితే బావుంటుంది అని అంటాడు. ఇక ఫణింద్ర ఆ పసుపు బోట్టను దేవయానిని పెట్ట మంటాడు. ఇక దేవయాని ఇష్టం లేకుండా జగతికి పసుపు బొట్టు పెడుతుంది. ఆ తర్వాత పనింద్ర 'ఈ ఇల్లు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ ' అని జగతికి (Jagathi) చెబుతాడు.
అదే క్రమంలో 'ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా నీ స్థానం ఎప్పటికీ నీదే' అని ఫణింద్ర (Phanindra) అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు. ఆ తర్వాత జగతి, మహేంద్ర లు పణింద్ర దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక జగతిని మహేంద్ర (Mahendra) కార్ వరకు తీసుకొని వెళ్తాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత మహేంద్ర (Mahendra) ' జగతి నేనంటే నువ్వే.. నువ్వంటేనేనే నీ గౌరవమే నా గౌరవం నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేను' అని జగతి తో అంటాడు. ఇక జగతి తో పాటు మహేంద్ర కూడా కారులో ఇంటికి వెళ్ళి పోతాడు. మహేంద్ర కూడా తనతోపాటు వచ్చినందుకు జగతి (Jagathi) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది.
ఇక ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర (Mahendra) ' నన్ను క్షమించు జగతి నా భార్యకు గౌరవం లేని చోట నేను ఉంచలేను' అని చెబుతాడు. దానికి జగతి ఎంతో ఎమోషనల్ అవుతుంది. ఇక జగతి (Jagathi) కూడా నేను నిన్ను అర్థం చేసుకున్నాను అన్నట్లు మాట్లాడుతుంది.
ఇక దేవయాని (Devayani) , ధరణి దగ్గరకు వచ్చి వెటకారంగా స్వీట్స్ చేయమని చెబుతుంది. ఆ తర్వాత రిషి ' వదినా నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావ్' అని ధరణి (Dharani) ని అడుగుతాడు. దానికి ధరణి అనుకోకుండా ఒక సంతోషాన్ని మిస్ అయినట్టు ఉంది అని చెబుతోంది.
మరోవైపు మహేంద్ర (Mahendra) 'జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. రిషి జగతిని అమ్మ గా గుర్తించాలి' అని అని అంటాడు. ఈ లోపు జగతి ఇంటికి రిషి (Rishi) వస్తాడు. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.