MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘అమరన్‌’ వివాదం: థియేటర్‌పై పెట్రోల్ బాంబు: కారణం?

‘అమరన్‌’ వివాదం: థియేటర్‌పై పెట్రోల్ బాంబు: కారణం?

శివ కార్తికేయన్, సాయిపల్లవి నటించిన అమరన్ సినిమా థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఈ దాడికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

2 Min read
Surya Prakash
Published : Nov 16 2024, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
amaran movie

amaran movie

 శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్‌. రీసెంట్​గానే ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ ని  అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించి భాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అయితే తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ అమరన్​ సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌ దగ్గర ఊహించని సంఘటన ఎదురై షాక్ ఇచ్చింది.

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సదరు థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడికి దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అసలేం జరిగింది. ఎందుకు పెట్రోల్ బాంబు దాడి జరిగింది

26
amaran Sivakarthikeyan

amaran Sivakarthikeyan

తమిళ  స్టార్ హీరో శివకార్తికేయన్ కు గత కొంతకాలంగా హిట్ పడలేదు. ప్రిన్స్, ఆయలాన్ సినిమాలు రెండు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో  సాయి పల్లవి కాంబినేషన్ లో అమరన్ చిత్రం చేసారు.  వీరమరణం చెందిన సైనికుడు ముకుందన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

 అమ‌ర‌న్ సినిమాలో ముకుంద్ పాత్ర‌లో శివ‌కార్తికేయ‌న్ క‌నిపించ‌గా...అత‌డి భార్య రెబెకా వ‌ర్గీస్ పాత్ర‌ను సాయిప‌ల్ల‌వి చేసింది. సాయిప‌ల్ల‌వి ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది.  ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ సంస్థ నిర్మింది. 

36


ఆ మధ్యన  ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది.. సినిమాను నిలిపివేయాలంటూ ఆందోళనలు జరిగాయి. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాకు అటెన్షన్ వచ్చేసింది.  అయితే రిలీజైన కొద్ది రోజులు దాకా ఏ సంఘటనా చోటు చేసుకోలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తాజాగా పెట్రో బాంబులు జరగటంతో.. ఈ సంఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారు దాడి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. స్థానిక గొడవల కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.
 

46

 'అమరన్‌' చిత్రంలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించరాని, దానిని వ్యతిరేకిస్తూ తమిళనాడు చెన్నైలోని పలు చోట్ల ఎస్‌డీపీఐ తరఫున వరుస ఆందోళనలు ఈ మధ్య జరిగాయి. రీసెంట్​గా ఆళ్వార్‌పేటలోని హీరో కమల్‌ హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఇంటర్‌నేషనల్‌ కార్యాలయం ఎదురుగా పలువురు ఆందోళనకు దిగారు.

  థియేటర్ ముందు జరిగిన పెట్రోల్ బాంబు దాడి ఈ నిరసనలతో ముడిపడి ఉన్నట్లు సమాచారం. పెట్రోల్ బాంబు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. 

56


టీజర్ విడుదలైనప్పుడే .. కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమాను నిలిపివేయాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేసారు. విడుదల చేసిన అమరన్ మూవీ టీజర్‌లో కాశ్మిరీలు, ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చే.. కొన్ని సన్నివేశాలను చూపించారు.

అంతే కాకుండా కలిసి మెలసి జీవించే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
 

66

 భార‌త ఆర్మీకి విశేష సేవలందించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్త‌కం అధారంగా ‘అమరన్‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఆయన జీవితంపై చాలాకాలం రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసారు.

రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ బెటాలియన్‌కు చెందిన మేజర్ వరదరాజన్.. ఏప్రిల్ 2014 లో జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని ఒక గ్రామంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Recommended image2
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
Recommended image3
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved