MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?

Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?

Lenin Review: అఖిల్‌ అక్కినేని హిట్‌ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన `లెనిన్‌` మూవీతో వస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 08 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లెనిన్‌తో వస్తోన్న అఖిల్‌ అక్కినేని
Image Credit : X/@SitharaEnts ·

లెనిన్‌తో వస్తోన్న అఖిల్‌ అక్కినేని

అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు `అఖిల్‌`. తన పేరుతోనే తొలి సినిమా చేసి ఆకట్టుకున్నాడు. యాక్షన్, కమర్షియల్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అఖిల్‌ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. చివరగా చేసిన `ఏజెంట్‌` కూడా దారుణంగా డిజప్పాయింట్‌ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు `లెనిన్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లెనిన్‌పై నాగార్జున, నాగ వంశీ, అఖిల్‌ కాన్ఫిడెన్స్
Image Credit : X/@SitharaEnts ·

లెనిన్‌పై నాగార్జున, నాగ వంశీ, అఖిల్‌ కాన్ఫిడెన్స్

`లెనిన్‌` మూవీలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలని అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆమె బయటకు వచ్చింది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చింది. కొంత షూటింగ్‌ డిలే కూడా అయ్యింది. ఫైనల్‌గా ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. అఖిల్‌ కి హిట్‌ పడే అవకాశం ఉందనే సాంకేతాలను ట్రైలర్‌ ఇచ్చింది. దీనికితోడు నాగార్జున, నాగవంశీ, అఖిల్‌ కూడా తమ కాన్ఫిడెంట్‌ని వెల్లడించారు. దీనికితోడు ఈ మూవీకి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం.

Related Articles

Related image1
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Related image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
34
లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌
Image Credit : X/@SitharaEnts ·

లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌

`లెనిన్‌` మూవీ బాగా వచ్చిందని, ఈ సారి వస్తున్నాం, కొడుతున్నామని నాగార్జున తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే మూవీకి పాజిటివ్‌ రిపోర్ట్ వస్తుంది. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో మూవీ స్టార్ట్ అవుతుందట. లెనిన్‌ ఉన్న ఊరు గురించి, లెనిన్‌ గురించి ఎన్టీఆర్‌ తన వాయిస్‌తో ఇంట్రో ఇస్తారట. ఆ తర్వాత అదిరిపోయే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీనియర్‌ ఎన్టీఆర్‌ డైలాగ్‌తో ఉండటం ఇందులో ఆకట్టుకునే అంశమని అంటున్నారు. సినిమా శ్రీరామపురంలో సాగుతుంది. అక్కడ జాతర చుట్టూ సాగే కథ ఇదని అంటున్నారు, అక్కడ ఊరు పెద్ద ఒకరు ఉంటాడు, ఆయన చేసే మిస్టేక్స్ ని ఎదురించే క్రమంలో ఊరి పెద్దకు, హీరోకు మధ్య గొడవలు జరుగుతాయి. అయితే గొడవలు ఊర్లో కామన్‌ ఈ సారి కొన్ని కట్టుబాట్లు ఉన్నా కూడా వాటిని బ్రేక్‌ చేసి తలలు లేవాల్సిందే అనే పట్టుదలకు పోవడం వల్లే ఈ మూవీలో అసలు గొడవలకు కారణమని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే డ్రామా, యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.

44
లెనిన్‌లో ట్విస్టే హైలైట్‌?
Image Credit : X/@SitharaEnts ·

లెనిన్‌లో ట్విస్టే హైలైట్‌?

అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే మధ్య లవ్‌ ట్రాక్‌ హైలైట్‌గా నిలుస్తుందట. ఊర్లో గొడవలకు వీరి లవ్‌ ట్రాక్ ఒక కారణమని టాక్‌. మరి ప్రేమ కోసం హీరో ఎలా పోరాడాడు అనేది చిత్ర కథ అని సమాచారం. అయితే సినిమాలో క్లైమాక్స్ లో హీరో హీరోయిన్‌కి సంబంధించిన ఒక షాకింగ్‌ ట్విస్ట్ ఉంటుందట. అదే మూవీకి హైలైట్‌గా నిలుస్తుందని, దాన్ని నమ్మే నాగ్‌, నాగ్‌ అశ్విన్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారని సమాచారం. ఫస్టాఫ్‌లో రెగ్యూలర్‌ స్టయిల్‌లో ఉన్నా, సెకండాఫ్‌లో ఇంటెన్సిటితో, సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుందని, నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠకు గురి చేస్తుందని అంటున్నారు. నాగార్జున కూడా ఇదే చెప్పారు. సెకండాఫ్‌ మీకు బోర్‌ తెప్పించదు అని. ఉప్పెన, పెద్ది తరహా ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుందని టాక్‌. మరి అది ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. కానీ ఇందులో నిజమెంతా? అనేది చూడాలి. అసలైన ఏసియా నెట్‌ తెలుగు రివ్యూ కోసం వేచి ఉండండి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
Recommended image2
Feel Good Movies: మూడ్ బాలేదా? ఈ 5 సినిమాలు చూస్తే మనసు తేలికపడటం ఖాయం
Recommended image3
NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
Related Stories
Recommended image1
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved