MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియుడి బర్త్ డే రోజు రెచ్చిపోయిన పాయల్... హ్యాండ్సమ్ అంటూ రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ

ప్రియుడి బర్త్ డే రోజు రెచ్చిపోయిన పాయల్... హ్యాండ్సమ్ అంటూ రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకుండా ప్రియడు కంపెనీ ఎంజాయ్ చేస్తున్నారు పాయల్ రాజ్ పుత్(Payal rajput). ఆమె చాలా కాలంగా నటుడు, మ్యూజిక్ కంపోజర్ సౌరభ్ దింగ్రా ప్రేమలో ఉన్నారు. పాయల్ కెరీర్ బిగినింగ్ లో సీరియల్ నటిగా చేశారు. అక్కడ సౌరభ్ తో ఆమెకు జతకుదిరింది

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 10 2022, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


ఇక సౌరభ్ (Saurabh Dhingra)బర్త్ డే సంధర్భంగా కొన్ని రొమాంటిక్ పిక్స్ షేర్ చేసింది పాయల్. హలో హ్యాండ్ సమ్ హ్యాపీ బర్త్ డే అంటూ... పబ్లిక్ గా ప్రియడు కౌగిలిలో వదిగిపోయింది. పాయల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

27


సౌరభ్-పాయల్ ఘాడంగా ప్రేమించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనం. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా పాయల్ సౌరభ్ తో కలిసి విహారానికి చెక్కేస్తారు. అందరికీ వీరి రిలేషన్షిప్ గురించి తెలుసు. ఈ నేపథ్యంలో హద్దులు లేని ప్రేమను అనుభవిస్తున్నారు. ఇక ఏళ్ల తరబడి  ప్రేమించుకుంటున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. 

37

పాయల్  టాలీవుడ్ ఎంట్రీ ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తో అదిరిపోగా.... ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతుందని అందరూ భావించారు. అనూహ్యంగా పాయల్ కెరీర్ మాత్రం గతుకుల రోడ్డుపై ఎద్దుల బండి నడకలా సాగుతుంది. 
 

47


పాయల్ గ్లామర్ కి కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ తో రొమాన్స్ చేస్తుంది అనుకుంటే... ఆమె రేంజ్ ఓటీటీ కి పడిపోయింది. ఫేడ్ అవుట్ అయిన ఈషా రెబ్బా, పూర్ణ వంటి హీరోయిన్స్ తో పాటు ఓటీటీ చిత్రాలు సిరీస్లు చేస్తున్నారు. పాయల్  నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. 

57

గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటి లో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం.

67


హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

 

77


అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IBomma Ravi: ఊహించని ఝలక్, ఐబొమ్మ రవి మళ్ళీ వచ్చాడా ? ఆ నిర్మాత కథ ముగిసినట్లే..
Recommended image2
Maatrubhumi: సల్మాన్ ఖాన్ కి బిగ్ షాక్, ఇప్పుడు మళ్ళీ 40 శాతం రీషూట్ చేయాలి.. అసలేమైంది?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved