MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌, వరుణ్‌, వైష్ణవ్‌ తేజ్‌ లకు ఈ ఏడాది బ్యాడ్‌ టైమ్‌.. చివరికి చిరు, సాయి ధరమ్‌ తేజ్‌లకూ తప్పలేదు

పవన్‌, వరుణ్‌, వైష్ణవ్‌ తేజ్‌ లకు ఈ ఏడాది బ్యాడ్‌ టైమ్‌.. చివరికి చిరు, సాయి ధరమ్‌ తేజ్‌లకూ తప్పలేదు

మెగా ఫ్యాన్స్ ఈ ఏడాది చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. ఐదుగురు మెగా హీరోలు తమ సినిమాలతో వచ్చారు. కానీ తీరని నిరాశని మిగిల్చారు. ఆశలు రేపి, వాటిని గల్లంతు చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 10 2023, 07:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ ఏడాది(2023) దాదాపు రెండు వందల సినిమాల వరకు రిలీజ్‌ అయ్యాయి. మరికొన్ని ఈ నెలలో విడుదల కావాల్సి ఉన్నాయి. అయితే ఏడాది రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ రాలేదు. కానీ మిగిలిన హీరోలంతా వచ్చారు. చిరంజీవి రెండు సినిమాలతో, సాయిధరమ్‌ తేజ్‌రెండు సినిమాలతో రాగా, పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ తలా ఒక్కో సినిమాతో ఆడియెన్స్ ని పలకరించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వరుసగా ఐదుగురు మెగా హీరోల సినిమాల ఈ ఏడాది విడుదలయ్యాయంటే మెగా ఫ్యాన్స్ కి పండగే. కానీ కానీ ఆ ఆనందం మాత్రం ఫ్యాన్స్ లేదు. దీనికి కారణం వారి సినిమాలు బోల్తా కొట్టడమే. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వాల్తేర్‌ వీరయ్య`తో వచ్చి ఊపేశాడు. ఈ మూవీ 250కోట్లు కలెక్ట్ చేసింది. రెండు పరాజయాల అనంతరం చిరంజీవికి ఇది పెద్ద హిట్‌ సినిమానే. అంతేకాదు ఆయన బౌన్స్ బ్యాక్‌ అయ్యే మూవీ అని చెప్పొచ్చు. 
 

38

కానీ ఆనందం ఎక్కువ రోజులు లేదు. ఆగస్ట్ కి ఆయన మరో సినిమా `భోళా శంకర్‌`తో వచ్చాడు. ఇది డిజాస్టర్‌గా నిలిచింది. మెహర్‌ రమేష్‌ దీనికి దర్శకత్వం వహించగా, తమన్నా హీరోయిన్‌గా చేసింది. కీర్తిసురేష్‌ చెల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ఔట్‌డేటెడ్‌ కథగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దారుణమైన ఫలితంతో నిర్మాతకి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ సినిమాతో నిర్మాత అనిల్‌ సుంకరి అప్పుల్లో కూరుకుపోయారని చెప్పొచ్చు. అలా ఇది `వాల్తేర్‌ వీరయ్య` ఆనందాన్ని పటాపంచల్‌ చేసింది. 
 

48

పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ఏడాదికో సినిమాతో వస్తున్నారు. గతేడాది `భీమ్లానాయక్‌`తో హిట్‌ అందుకున్నారు. ఈ ఏడాది `బ్రో` మూవీతో వచ్చాడు. నటుడు సముద్రఖని రూపొందించిన ఈ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పవన్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి పెద్ద నిరాశపరిచిందని చెప్పొచ్చు.
 

58
Virupaksha

Virupaksha

అంతేకాదు `బ్రో` సినిమాతో సాయిధరమ్‌ తేజ్‌ కూడా డిజప్పాయింట్‌ చేశాడు. ఆయన ఇందులో ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే సమ్మర్‌లో `విరూపాక్ష` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు సాయితేజ్‌. సాయి కమ్‌ బ్యాక్‌ అనుకున్నారు. కానీ `బ్రో` ఆ హ్యాపీనెస్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. 

68

వరుణ్‌ తేజ్‌కి ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. ఆయనకు `ఎఫ్‌3` తర్వాత సక్సెస్‌ రావడం లేదు. అంతకు ముందు `F2` తర్వాత చేసిన `గద్దల కొండ గణేష్‌` యావరేజ్‌గానే ఆడింది, `గని` డిజాస్టర్‌ అయ్యింది. `ఎఫ్‌3`తో కొంత ఫర్వాలేదనిపించాడు. కానీ `గాంఢీవధారి అర్జున` చిత్రంతో మరో ఫ్లాప్‌ పడింది. దీంతో వరుస ఫ్లాప్‌లతో డౌన్‌ అయిపోయాడు వరుణ్‌. 

78

ఇటీవల ఆయన పెళ్లి చేసుకుని కొత్త లైఫ్‌ స్టార్ట్ చేశాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠినే ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వరుణ్‌ తేజ్‌కి కలిసొస్తుందని భావించారు. ఆయన నటించిన `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంతో హిట్‌ కొట్టాలని భావించారు. డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. మొత్తంగా పెళ్లితో ఖుషి చేసినా, సినిమాతో అభిమానులను హ్యాపీ చేయలేకపోయారు. 
 

88

ఇక `ఉప్పెన`తో సంచలన క్రియేట్‌ చేసిన వైష్ణవ్‌ తేజ్‌కి కూడా ఈ ఏడాది కలిసి రాలేదు. ఆయన ఇప్పటికే `కొండపొలం`, `రంగ రంగా వైభవంగా` సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయాలను చవి చూశారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన `ఆదికేశవ` సినిమాతో వచ్చారు. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ఇలా హ్యాట్రిక్‌ డిజాస్టర్లని చవిచూశాడు వైష్ణవ్‌. ఇలా మెగా హీరోలు ఈ ఏడాది ఫ్యాన్స్ ని ఎక్కువగా డిజప్పాయింట్‌ చేశారని చెప్పొచ్చు. ఇక వచ్చే ఏడాదిలోనైనా వీరినుంచి బ్లాక్‌ బస్టర్స్ వస్తాయని ఆశిద్దాం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image2
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Recommended image3
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved