MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరలో కత్తిలాగా ఉన్న నదియా.. అందంలో కుర్రభామలకు పోటీఇస్తున్న పవన్‌ కళ్యాణ్‌ అత్త.. ఫోటోలు వైరల్‌

చీరలో కత్తిలాగా ఉన్న నదియా.. అందంలో కుర్రభామలకు పోటీఇస్తున్న పవన్‌ కళ్యాణ్‌ అత్త.. ఫోటోలు వైరల్‌

ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించి ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తుంది నదియా. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న నదియా తాజాగా హైదరాబాద్‌లో సందడి చేసింది. `ఎల్‌జీఎం` సినిమా ఈవెంట్‌లో పాల్గొని ఆకట్టుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 24 2023, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నదియా తాజాగా `ఎల్‌జీఎం` సినిమా ఈవెంట్‌లో పాల్గొంది. క్రికెటర్‌ ధోనీ భార్య సాక్షి ధోని తన ధోని ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో సాక్షి ధోనితోపాటు నదియా కూడా పాల్గొన్నారు. 
 

28

`ఎల్‌జీఎం` మూవీ ఈవెంట్‌లో నదియా సైతం అందరిని ఆకట్టుకుంది. ఆమె శారీలో మెరిసింది. ట్రెడిషనల్‌ లుక్‌లో కత్తిలాగా ఉంది నదియా. అందంతో కట్టిపడేస్తుంది. కుర్రహీరోయిన్లకి పోటీ ఇస్తుందీ పవన్‌ కళ్యాణ్‌ అత్త. ప్రస్తుతం ఈ సీనియర్‌ భామ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

38

ఈ సందర్భంగా నదియా మాట్లాడుతూ, `చాలా రోజుల త‌ర్వాత హైద‌రాబాద్ వ‌చ్చాను. ధోని ఎంట‌ర్‌టైన్మెంట్స్‌లో  పార్ట్ కావ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌ను మీరెలా ఎంజాయ్ చేశారో.. అలాగే ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను. మంచి టీమ్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. ధోని, సాక్షిగారికి ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమాభిమానాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను` అని తెలిపింది నదియా. 
 

48

నదియా.. తెలుగులో చివరగా `సర్కారు వారి పాట` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె బ్యాంక్‌ మెనేజర్‌ పాత్రలో నటించారు. పాత్ర కొద్దిసేపే ఉన్నా, ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆమె సన్నివేశాలు చివర్లో కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. హైలైట్‌గా నిలిచాయి. 
 

58

అంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ నటించిన `అత్తారింటికి దారేదీ` చిత్రంలో నటించింది. ఇందులో పవన్‌కి అత్తగా నటించింది నదియా. బలమైన పాత్రలో మెప్పించింది. క్లైమాక్స్ లో నదియా, పవన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఆయా సీన్లు సైతం కన్నీళ్లు పెట్టిస్తాయి. 

68

ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన నదియా.. ఇటీవల క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన `ఎల్‌జీఎం`లోనూ ఆమెది అత్త పాత్రే అని తెలుస్తుంది. హీరోయిన్‌కి అత్తగా నటిస్తుందని టాక్‌. ఈ సినిమా ప్రధానంగా ప్రియురాలు, తల్లికి మధ్య నలిగిపోయే కుర్రాడి పాత్ర ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

78

ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్త‌గారితో క‌లిసి ఉండ‌లేన‌ని, వేరు కాపురం పెడ‌తామ‌ని పెళ్లికి ముందే ఆ కాబోయే వ‌రుడితో అంటే.. త‌న‌కు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతాన‌ని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు త‌ల్లి.. మ‌రో వైపు కాబోయే భార్య మ‌ధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది ప‌డ్డాడ‌నే క‌థాంశంతో రూపొందిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) అని టీమ్‌ వెల్లడించింది. 
 

88

హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ విడుద‌ల చేస్తున్నాయి.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
MSG Final Collections: మన శంకర వర ప్రసాద్‌ గారు ఫైనల్‌ కలెక్షన్లు.. చిరంజీవి మూవీకి లాభం ఎన్ని కోట్లంటే
Recommended image2
Balakrishna: ఎన్టీఆర్‌ని చూసి వణికిపోయే బాలకృష్ణ ఈ ఒక్క విషయంలో తండ్రినే ఎదురించాడు.. దెబ్బకి లైఫ్‌ సెట్‌
Recommended image3
Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved