MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `హరి హర వీరమల్లు` కోసం రూల్స్ అన్నీ పక్కన పెడుతున్న పవన్‌ కళ్యాణ్‌.. ఏం చేయబోతున్నాడంటే?

`హరి హర వీరమల్లు` కోసం రూల్స్ అన్నీ పక్కన పెడుతున్న పవన్‌ కళ్యాణ్‌.. ఏం చేయబోతున్నాడంటే?

పవన్‌ కళ్యాణ్‌ `హరి హర వీరమల్లు` కోసం సాహసం చేస్తున్నారు. తన రూల్స్ అన్నీ పక్కన పెట్టబోతున్నారు. మరి ఆయన ఏం చేయబోతున్నారో ఇందులో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 21 2025, 05:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పవన్‌ కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా మూవీ `హరిహర వీరమల్లు`
Image Credit : Asianet News

పవన్‌ కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా మూవీ `హరిహర వీరమల్లు`

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ మరో నాలుగు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడబోతుంది. ఈ మూవీ కోసం పవన్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

పైగా పవన్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ కావడంతో అభిమానుల్లోనే కాదు, కామన్‌ ఆడియెన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది. సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పలు మార్లు వాయిదా పడ్డ `హరి హర వీరమల్లు`
Image Credit : Asianet News

పలు మార్లు వాయిదా పడ్డ `హరి హర వీరమల్లు`

అయితే `హరి హర వీరమల్లు` సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది. పలు మార్లు షూటింగ్‌ స్టార్ట్ అయి ఆగిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా బిజీ కావడంతో షూటింగ్‌ చేయడం కుదరలేదు. అంతకు ముందు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 

 రిలీజ్‌కి సంబంధించిన డేట్స్ ప్రకటించినా, వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇటీవల కాలంలోనే రెండు మూడుసార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ మూవీ జులై 24న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

36
`హరి హర వీరమల్లు` రిలీజ్‌ కష్టాలు
Image Credit : X-@APDeputyCMO

`హరి హర వీరమల్లు` రిలీజ్‌ కష్టాలు

`హరి హర వీరమల్లు` సినిమా బిజినెస్‌కి సంబంధించి రకరకాల ప్రచారం ఉంది. బయ్యర్లు ఆసక్తి చూపించలేదనే టాక్ ఉంది. మరోవైపు నిర్మాత ఏఎం రత్నం సొంతంగానే రిలీజ్‌కి వెళ్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. 

సినిమాని కంప్లీట్‌ చేయడానికి పవన్‌ తన సగం పారితోషికం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందట. మరోవైపు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ బాగా చేయలేకపోయారు.

 తెలుగులో ప్రమోషన్స్ బాగానే ఉన్నా, ఇతర భాషల్లో ప్రమోషన్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాని నిలబెట్టేందుకు పవన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

46
హరి హర వీరమల్లు కోసం పవన్‌ సాహసం
Image Credit : Asianet News

హరి హర వీరమల్లు కోసం పవన్‌ సాహసం

`హరి హర వీరమల్లు` సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు పవన్‌ కళ్యాణ్‌ రెడీ అయ్యారట. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన నడుంబిగించినట్టు తెలుస్తోంది. 

నిర్మాతని బతికించేందుకు పవన్‌ తనవంతు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినట్టు టాక్. అందులో భాగంగా సోమవారం `హరిహర వీరమల్లు` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఆయన హాజరు కానున్నారు. 

దీంతోపాటు ఈ ఈవెంట్‌కి ముందే ఓ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్‌ మీట్‌లో కూడా ఆయన హాజరు కానున్నట్టు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన సినిమా మీడియాని కలవబోతున్నారని చెప్పొచ్చు.

56
సినిమా ప్రమోషన్స్ లో పవన్‌ కళ్యాణ్‌
Image Credit : Asianet News

సినిమా ప్రమోషన్స్ లో పవన్‌ కళ్యాణ్‌

ఇదే కాదు పలు ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారట పవన్‌. టీమ్‌ ఇంటర్వ్యూలు, పలు బిగ్‌ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వాలని, అలాగే ఇతర స్టేట్స్ లో ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు టాక్‌. 

ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌`, `కాటమరాయుడు` సినిమాల సమయంలో ఇలా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు పవన్‌. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన ఇలాంటి మీడియా ప్రమోషన్స్ చేయలేదు. 

కేవలం ఒక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరయ్యేవారు. ఇప్పుడు `హరి హర వీరమల్లు` కోసం, నిర్మాత ఏఎం రత్నం కోసం ఆయన తన రూల్స్ అన్నింటిని పక్కన పెట్టబోతున్నారు. 

డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, వాటి రిలేటెడ్‌ రూల్స్ అన్ని పక్కన పెట్టి ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

66
వీరమల్లుగా పవన్‌ విశ్వరూపం
Image Credit : X/Harihara Veeramallu

వీరమల్లుగా పవన్‌ విశ్వరూపం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. ఆయనది ఔరంగజేబ్‌ పాత్ర అని సమాచారం.

 ఇందులో పవన్‌ ఆంధిగా కనిపించబోతున్నారు. విష్ణువు, శివుడి ప్రతిరూపమైన వీరమల్లుగా కనిపిస్తారని తెలుస్తోంది. ఏఎం రత్నం నిర్మించిన ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.  

క్రిష్‌ మూవీ నుంచి తప్పుకోవడంతో జ్యోతి సినిమా పగ్గాలు తీసుకున్నారు. తనదైన  స్టయిల్‌లో ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాని తీర్చిదిద్దారట. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Related Stories
Recommended image1
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ నిర్మలమ్మ ఒక్క అక్షరం కోసం 15 టేకులు, అర్థరాత్రి అయినా రాలేదు.. ఏం జరిగిందంటే?
Recommended image2
జగపతిబాబు కూతురు విదేశీ వ్యక్తిని ప్రేమించినందుకు సొంత కులం వాళ్లే కుట్ర.. మతిపోయే విషయాలు బహిర్గతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved