- Home
- Entertainment
- కింగ్డమ్, దేవర, హరిహర వీరమల్లు చిత్రాలకు సీక్వెల్స్ వస్తే ఏమవుతుంది.. ఏ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి ?
కింగ్డమ్, దేవర, హరిహర వీరమల్లు చిత్రాలకు సీక్వెల్స్ వస్తే ఏమవుతుంది.. ఏ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి ?
టాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ రావలసి ఉంది. కానీ ఆ చిత్రాలపై ఫ్యాన్స్ లో మాత్రం అసలు ఆసక్తి లేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్
టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బలంగా ఉంది. భారీ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూ వాటికి సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, పుష్ప లాంటి చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. వార్, ధూమ్, క్రిష్ లాంటి చిత్రాలు ప్రాంఛైజీలుగా కొనసాగుతున్నాయి.
KNOW
మొదటి భాగం హిట్ అయితేనే..
మొదటి భాగం మంచి విజయం సాధిస్తే రెండవ భాగంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రభాస్ కల్కి 2898 ఎడి చిత్రం సంచలన విజయం సాధించింది. దీనితో కల్కి 2 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి పూర్తిస్థాయిలో మంచి రెస్పాన్స్ అందుకోని చిత్రాలకు కూడా సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. మరి అంచనాలు అందుకోలేకపోయిన చిత్రాలకు సీక్వెల్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికర అంశం.
కింగ్డమ్ పార్ట్ 2 ఉంటుందా ?
ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో మెప్పించలేకేపోయింది. కలెక్షన్స్ లో కూడా ఈ చిత్రం లాభాలు రాబట్టలేదు. సినిమాకి మంచి హైప్ వచ్చినప్పటికీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి యావరేజ్ కంటెంట్ తో సరిపెట్టేశారు. కింగ్డమ్ మొదటి భాగానికి మాత్రమే 80 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా నిర్మాత నాగవంశీ ప్రకటించారు. కానీ సీక్వెల్ పై ఆడియన్స్ లో అంతగా ఆసక్తి లేదనే చెప్పాలి. ఒక వేళ సీక్వెల్ చేయాలని నిర్మాత డిసైడ్ అయితే మొదటి భాగానికి మించిన బడ్జెట్ పెట్టాలి.. హైప్ తీసుకురావాలి. ఇప్పుడున్న అంచనాలతో అది అంత సులభం కాదు.
హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్దభూమి
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్లు ఆలస్యం కావడమే ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఈ చిత్రం కూడా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నిర్మాతకి ఈ చిత్రం తీవ్ర నష్టాలు మిగిల్చింది. ఈ చిత్రానికి కూడా హరిహర వీరమల్లు 2 యుద్ధభూమి పేరుతో సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇలాంటి అవుట్ పుట్ తో సినిమా చేస్తే అసలు సీక్వెల్ అవసరం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దేవర 2పై క్లారిటీ లేదు
గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 రిలీజ్ అయింది. ఊహకందని హైప్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది కానీ ప్రభంజనం అయితే సృష్టించలేదు. కొరటాల శివ ఒక రేంజ్ సినిమా రిలీజ్ కి ముందు అంచనాలు పెంచేశారు. కానీ మూవీలో ఉన్న కంటెంట్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేదు. ఈ చిత్రానికి పార్ట్ 2 రావలసి ఉంది. దేవర 1 రిలీజై ఏడాది గడుస్తున్నప్పటికీ దేవర 2 పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా రాదా అనే క్లారిటీ కూడాలేదు. ప్రస్తుతానికి ఈ మూవీ సీక్వెల్ పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి లేదనే చెప్పాలి.

