MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఎందుకు..? అసలు ఎవరు వారాహి..? దీక్ష నియమాలేంటి..?

పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఎందుకు..? అసలు ఎవరు వారాహి..? దీక్ష నియమాలేంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎంగా ఆయన పని చేసుకుంటూనే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే అసలు ఆయన ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు..? అసలు ఎవరు ఈ వారాహి అమ్మవారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 28 2024, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
pawan

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దాదాపు దశాబ్ధానికి పైగా కష్టపడిన ఆయన..ఎట్టకేలకు  ఏపీ డిప్యూటీ సీఎం  అయ్యారు. అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేశారు.  జనసేన పార్టీ అధినేతగా పదేళ్ల పాటు.. ఉండి… ఓర్పుతో చివరకు సక్సెస్ అయ్యారు పవన్, కూటమితో కలిసి పోటీ చేసి ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు.

ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..? కల్కి కోసం ఎంత తీసుకున్నాడో తెలుసా...?

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
pawan varahi deeksha

pawan varahi deeksha

ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పవర్ స్టార్ తాజాగా వారాహి దీక్ష చేపట్టారు. కాషాయం ధరించి.. ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. సాత్వికాహారం తీసుకుంటూ.. 11రోజులు దీక్షకు పూనారు. కాగా అసలు పవర్ స్టార్ ఈ వారాహి దీక్ష ఎందుకు చేస్తున్నారు...? కారణం ఏంటి..? అసలు ఎవరు ఈ వారాహి..? దీక్ష నీయమాలు ఏంటి..? ఇప్పుడు చేడానికి కారణం ఏంటి..? 

37
Pawan

Pawan

జయం కోసం.. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు శక్తి కోసం.. చేసేపనులలో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వారాహి దీక్షను చేస్తారు. అందుకే పవర్ స్టార్ ఎన్నికల రధానికి కూడా వారాహి అమ్మవారి పేరు పెట్టారు. వారాహి మీద  కూడా వైసీపి విమర్శలు చేయగా.. ఆయన ఆ వాహనం నుంచే ప్రచారం చేసి..అఖండ విజయం సాధించారు. 

47

వారాహి మాత దుర్గాదేవి ప్రతిరూపం.. ఆమె ఏడు ప్రతిరూపాలలో వారాహి మాత కూడా ఒకరు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి పాత్ర కనిపిస్తుంది. అంతే కాదు శ్రీ లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు అని అంటుంటారు. 
 

57

వరాహ రూపం కలిగిన ముఖం ఉండటం వల్ల అమ్మవారికి వారాహి అని పేరు వచ్చింది. చేతిలో నాగలి, దండం, శంఖుచక్రాలతో.. దర్శనం ఇస్తారు మాత, అంతే కాదు ఆమెకు గుర్రం,దున్నపోతు, సింహం వంటి పలు వాహనాలు కలిగి ఉంటుంది అని అంటుంటారు. అయితే  వారాహి అమ్మవారి గురించి  అందరికి తెలియదు. పురాణాల మీద పట్టుఉన్నవారు...అంతో ఇంతో ఆధ్యాత్మి జ్ఞానం కలిగిన వారికి మాత్రమే అమ్మవారి గురించి తెలుస్తుంది. 

67
Pawan

Pawan

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నుంచి.. అమ్మవారి గురించి ఎక్కవమంది తెలుసుకోగలిగారు. ఈ దీక్షగురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు.  ఇక  ఈ దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందులో  భాగంగా  కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. నేలపై పడుకుంటున్నారు. ఉదయం సాయంత్ర పూజ.. చన్నీటి స్నానం చేస్తారు. ఇవన్నీ చేస్తూ.. తమ వృత్తి తాము చేసుకోవచ్చు. 
 

77
Varahi campaign

Varahi campaign

ఇక ఈ వారాహి అమ్మవారి దీక్షను ఎప్పుడు చేస్తారంటే...  జేష్ఠ మాసం చివరిన..  ఆషాడ మాసం స్టార్ట్ అయ్యేటైమ్ లో అమ్మవారి దీక్ష చేపడతారు. ప్రతీ రోజు వారాహి స్తోత్రం పఠించడం తప్పనిసరి.  ఈ దీక్షను నవరాత్రి  టైమ్ లో కూడా కొంత మంది చేస్తుంటారు. నవరాత్రి టైమ్ లో మాత్రం వారాహి దీక్ష 9 రోజులు చేస్తారు.. ఇప్పుడు మాత్రం 11 రోజుల దీక్ష ఉంటుంది. ప్రస్తుతం పవన్ తమ ప్రభుత్వం.. పాలన సక్రమంగా జరగాలని.. ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved