పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లోడింగ్? డిప్యూటీ సీఎం ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా? మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్ జరుగుతుందా? ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఆయనకు సినిమాలు చేయడానికి టైమ్ కుదరడం లేదు. ప్రస్తుతం ఆయన చేయాల్సిన సినిమాలు మూడు న్నాయి. `హరిహర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొనడమే ఆలస్యం. `హరిహర వీరమల్లు` సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు పవన్. టైమ్ దొరికినప్పుడల్లా ఆయన ఈ మూవీని కంప్లీట్ చేసే బాధ్యతలు తీసుకున్నారు.
`హరిహర వీరమల్లు` సినిమా కంప్లీట్ అయిన తర్వాత టైమ్ చూసుకుని `ఓజీ` మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా కోసం అటు ఫ్యాన్స్. ఇటు పవన్, సినిమా వర్గాలు వెయిట్ చేస్తున్నాయి. ఈ మూవీ భారీ స్థాయిలో ఉండబోతుందని, పవన్ రేంజ్‌కి ఇమేజ్‌కి కరెక్ట్ గా సెట్ అయ్యే మూవీ కాబోతుందని అంతా భావిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే ఈ అటు `హరిహర వీరమల్లు`, ఇటు `ఓజీ` రిలీజ్ కానున్నాయి.
Pawan Kalyan- Trivikram
ఇదిలా ఉంటే హరీష్ శంకర్‌తో చేయాల్సిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ ఉంటుందా? క్యాన్సిల్ అవుతుందా? అనేది పెద్ద సస్పెన్స్. పవన్ ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఆయన ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారా అనేది డౌట్. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. ఓ అదిరిపోయే కాంబో సెట్ కాబోతుందని అంటున్నారు.
అది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వర్క్ నడుస్తుందట. త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అన్ని కుదిరితే ఈ మూవీ సెట్ కాబోతుందని తెలుస్తుంది. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నారు. వీరి ముగ్గురు కాంబినేషన్‌లో `అజ్ఞాతవాసి` సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అది డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ `జల్సా`, `అత్తారింటికి దారేదీ`, `అజ్ఞాతవాసి` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారు. బన్నీ కెరీర్‌లోనే మొదటి మైథలాజికల్ మూవీని తెరకెక్కించబోతున్నారట. భారీ స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది త్వరలోనే ప్రారంభం కానుందట. అనంతరం త్రివిక్రమ్.. పవన్ సినిమా చేస్తారని తెలుస్తుంది.ఈ లెక్కన ఇది స్టార్ట్ కావడానికి మరో రెండేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. ఇదే నిజమైతే నిజంగానే పవన్ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌తో కూడిన ట్విస్ట్ ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు.
read more: పదేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోయిన్‌తో బాలయ్య రొమాన్స్? అప్పుడు ఫ్లాప్, మరి ఇప్పుడైనా హిట్ ఇస్తుందా?
also read: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్ బంమ్స్ అప్‌డేట్.. RC16 స్టోరీలో కీలక పాయింట్ లీక్?