MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ షూస్ ఖరీదుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు తెలుసా... మరీ అన్ని లక్షలు ఏంది సామీ!

పవన్ షూస్ ఖరీదుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు తెలుసా... మరీ అన్ని లక్షలు ఏంది సామీ!

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ టీ షర్ట్, జీన్స్ క్యాజువల్ షూట్ ధరించి యంగ్ లుక్ లో అదిరిపోయాడు. కాగా పవన్ వేసుకున్న ఆ షూస్ ధర హాట్ టాపిక్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 01 2022, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pawan Kalyan

Pawan Kalyan

పాలిటిక్స్ కి కొంచెం బ్రేక్ ఇచ్చిన పవన్ హరిహర వీరమల్లు షూట్ కి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన హరి హర వీరమల్లు వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. ఈ వర్క్ షాప్ కి పవన్ రెగ్యులర్ గెటప్ కి భిన్నంగా క్యాజువల్స్ లో హాజరయ్యారు. 
 

27
Pawan Kalyan

Pawan Kalyan

పాలిటిక్స్ లోకి వచ్చాక పవన్ ట్రెండీ బట్టల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఆయన తెల్లబట్టలను ఎక్కువగా ధరిస్తున్నారు. హరి హర వీరమల్లు వర్క్ షాప్ కి ఆయన డిఫరెంట్ లుక్ లో హాజరయ్యారు. సినిమాకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఫుల్ అప్డేటెడ్ అండ్ ట్రెండీ గెటప్ లో వచ్చారు.

37
Pawan Kalyan

Pawan Kalyan

రెడ్ టీషర్ట్, జీన్స్, షూస్ ధరించి సూపర్ హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ఆయన లుక్ ఫ్యాన్స్ ని పిచ్చ ఫిదా చేసింది. ఈ గెటప్ లో ఓ మూవీ చేయాలని డిమాండ్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా దర్శకుడు హరీష్ కి వారు విన్నపాలు వినిపిస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ మూవీలో అలా చూపించాలని కోరుతున్నారు. సదరు ట్వీట్స్ కి హరీష్ శంకర్ స్పందించడం విశేషం. 

47
Pawan Kalyan

Pawan Kalyan


పవన్ ని టాప్ టు బాటమ్ పరిశీలించిన ఫ్యాన్స్ ఓ విషయాన్ని పసిగట్టారు. పవన్ ధరించిన షూస్ బ్రాండ్ నేమ్, ప్రైస్ ట్రేస్ అవుట్ చేశారు. ఆ షూష్ ధర తెలిశాక ఒక్కొక్కరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కారణం... వారి ధర అంతలా ఉంది మరి. కోపెన్ హాగన్ (Copenhagen CPH460M MMCM) బ్రాండ్ కి చెందిన ఈ మోడల్ ధర అక్షరాలా 11994 యూరోలు. ఇండియన్ కరెన్సీలో రూ. 9.6 లక్షలు. 
 

57
Pawan Kalyan

Pawan Kalyan

అంటే దాదాపు రూ. 10 లక్షల విలువ చేసే షూస్ ఆయన ధరించారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ గొప్పగా ప్రచారం చేస్తున్నారు. కొందరైతే ఆయన షూస్ కోసం పెట్టిన ఖర్చుతో ఒక మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కోవచ్చని కామెంట్ చేస్తున్నారు. సినిమాకు రూ. 50 కోట్లు తీసుకునే పవన్ అంత ఖరీదైన షూస్ వాడడంలో తప్పులేదు.

67
pawan kalyan

pawan kalyan


ఇక అక్టోబర్ 5 నుండి పవన్ బస్సుయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అనూహ్యంగా దానిని వాయిదా వేశారు. హరి హర వీరమల్లు నిర్మాతల నుండి ఒత్తిడి పెరగడంతో మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. 

77

దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 40 నుండి 50 శాతం షూట్ పూర్తి చేశారు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Top 10: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే..ధురంధర్ కి పోటీగా తెలుగు హీరో ఫ్లాప్ మూవీ
Recommended image2
Dhurandhar 2 Controversy: చిక్కుల్లో ధురంధర్ 2.. ఈ టైంలో ఇలాంటి సినిమానా ? కోర్టు ఏం చేయబోతోంది..
Recommended image3
Upasana: పెళ్లి అయ్యాక చిరంజీవికి దూరంగా రామ్‌ చరణ్‌ వేరే కాపురం.. నిజాలు ఓపెన్‌గా చెప్పిన ఉపాసన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved