MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భార్యతో కలిసి పవన్ కళ్యాణ్‌ పబ్లిక్‌లో తిరగడం వెనుక ఆంతర్యమిదేనా?.. పవర్‌ స్టార్‌ పెద్ద స్కెచ్చే వేశాడుగా!

భార్యతో కలిసి పవన్ కళ్యాణ్‌ పబ్లిక్‌లో తిరగడం వెనుక ఆంతర్యమిదేనా?.. పవర్‌ స్టార్‌ పెద్ద స్కెచ్చే వేశాడుగా!

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తన భార్య అనా కొణిదెలతో కలిసి పబ్లిక్‌లో తిరగడం చర్చనీయాంశం అవుతుంది. అయితే దీని వెనుక పెద్ద ప్లాన్‌ ఉందని సమాచారం.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 15 2024, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ప్రొఫేషనల్‌ పొలిటికల్‌ లీడర్‌గా మారబోతున్నారు. ఆల్‌రెడీ ఇప్పటికే ఆయన పూర్తి స్థాయి నాయకుడిగా మారిపోయాడు. సినిమా హీరో కంటే రాజకీయ నాయకుడిగా ప్రభావితం చేస్తున్నారు. పవర్‌స్టార్‌ని డామినేట్‌ చేస్తున్నాడని చెప్పొచ్చు. 
 

29

పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ, బీజేపీతో కలిసి ఏపీ 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. సర్వేలు, తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని తెలుస్తుంది. పవన్‌ రాజకీయాల్లో కీ రోల్‌ పోషించబోతున్నాడని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వంలో ఆయన కింగ్‌ మేకర్‌గా మారబోతున్నాడని సమాచారం. 

39

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తన భార్య అన్నా లెజినోవాతో కలిసి కనిపిస్తున్నారు. ఓటింగ్‌ రోజు తన భార్యతో కలిసి పోలింగ్‌ బూతుకు వచ్చాడు. ఆమెకి ఓటు హక్కు లేకపోయినా తీసుకొచ్చి అందరికి చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇది టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌ గా మారింది. ఓటు హక్కులేని పవన్‌.. తన భార్యతో ఎందుకు రావాల్సి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. 

49

ఇప్పుడు మోడీ వారణాసి నామినేషన్స్ సందర్భంగా, ఆయన నామినేషన్‌ కార్యక్రమంలోనూ పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. అక్కడికి కూడా పవన్‌ తన భార్యతోనే వెళ్లడం మరో విశేషం. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లిపూజలు, అభిషేకం చేశారు. 
 

59

ఇందులో పవన్‌తోపాటు భార్య అనా కొణిదెల ఆలయాన్ని తిలకించింది. పవన్‌ దగ్గరుంచి వివరించారు. వీరితోపాటు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర అటవీశాఖా మంత్రి అరుణ్‌ కుమార్‌ సక్సేనా కూడా ఉండటం విశేషం. దీంతో దేశ రాజకీయాల్లోనూ పవన్‌ కీలకంగా మారుతున్నారని అనిపిస్తుంది. 

69

అయితే ఈ కార్యక్రమానికి కూడా తన భార్యతో పవన్‌ వెళ్లడం అటు రాజకీయా వర్గాల్లో, ఇటు సినిమా రంగంలోనూ చర్చనీయాంశం అవుతుంది. పవన్‌ ప్లాన్‌ ఏంటి? దాని ఆంతర్యమేంటి అనేది పెద్ద ప్రశ్న. అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. పవన్‌ తన మూడో భార్య అనా కొణిదెలతో విడిపోయాడంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 
 

79

ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని, దీంతో ఈ ఇద్దరు విడిపోతున్నారని, అనా రష్యా వెళ్లిపోయిందని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని తెలిసింది. నాల్గో పెళ్లికి పవన్‌ రెడీ అవుతున్నారని అన్నారు. దీన్నే ఛాన్స్ గా తీసుకుని వైసీపీ నాయకులు రెచ్చిపోయి విమర్శలు చేశారు. వాటన్నింటికి సమాధానం చెప్పే ఉద్దేశ్యంతో పవన్‌ ఇలా తన భార్యని పబ్లిక్‌లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. 
 

89

పవన్‌ రాజకీయంగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా మారబోతున్నాడు. ఆయన స్థాయి పెరుగుతుంది. దీంతో ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలకు తావులేకుండా, ఆ వైపు చర్చ లేకుండా చేసేందుకు, అదే సమయంలో ఆడవాళ్ల వైపు నుంచి నెగటివ్‌ ఇమేజ్‌ లేకుండా ఉండేందుకు పవన్‌ ఇలా ప్లాన్‌ చేశారని తెలుస్తుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్న మాట, భార్య రష్యా వెళ్లిపోయిన మాట నిజమే అని, కాకపోతే ఆ సమస్యలను పవన్‌ సెట్‌ చేసుకున్నారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
 

99

పవన్‌ కళ్యాణ్‌ మొదట 1997లో నందిని వివాహం చేసుకున్నారు. ఇద్దరికి సెట్‌ కాలేదు. పదేళ్ల తర్వాత విడిపోయారు. ఇద్దరు విడిపోవడానికి ముందే పవన్‌ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. రిలేషన్‌షిప్‌ మెయింటేన్‌ చేశాడు. పెళ్లికి ముందే ఆమెతో బిడ్డని అకీరా నందన్‌ని కన్నారు. 2009లో పెళ్లి తర్వాత ఆద్య జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకే విడిపోయారు. అనంతరం రష్యా నటి అనా లెజినెవాని 2013లో మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image2
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Recommended image3
Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved